జనసేన దెబ్బకు గజగజా వణికిన ట్విట్టర్.. జగన్ ఊహలకు భిన్నంగా?

ఏపీ ప్రజల్లో మంచి గుర్తింపు ఉన్న పార్టీలలో జనసేన పార్టీ ఒకటనే సంగతి తెలిసిందే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు జనసేన పార్టీని అధికారంలోకి తీసుకొనిరావడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఏపీలో రోడ్ల దుస్థితి గురించి పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా ద్వారా పోరాటాన్ని ప్రారంభించారనే సంగతి తెలిసిందే. గుడ్ మార్నింగ్ సీఎం సార్ హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్ లో ప్రస్తుతం వైరల్ అవుతుండటం గమనార్హం.

జనసేన దెబ్బకు ట్విట్టర్ సైతం గజగజా వణికిందని పవన్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఈ హ్యాష్ ట్యాగ్ తో 3.355 లక్షల ట్వీట్లు వచ్చాయని 218 మిలియన్ల మందికి జనసేన ట్వీట్లు చేరాయని పార్టీ నుంచి ప్రకటన వెలువడింది. ట్విట్టర్ లో ఈ పోరాటం మొదలైన కొన్ని గంటల్లోనే తొలి స్థానానికి గుడ్ మార్నింగ్ సీఎం సార్ హ్యాష్ ట్యాగ్ చేరుకోవడంతో పవన్ అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

సోషల్ మీడియాలో ట్వీట్లు, రీ ట్వీట్లను చూసి పవన్ ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు. పవన్ కళ్యాణ్ సైతం తన పోరాటానికి కోటీ 70 లక్షల మంది మద్దతు దక్కిందని వెల్లడించారు. అయితే పవన్ కళ్యాణ్ ప్రజల్లోకి రావాలని ప్రజల్లో జనసేన పార్టీపై మరింత మంచి అభిప్రాయం కలిగేలా కృషి చేయాలని పవన్ మేలు కోరేవాళ్లు అభిప్రాయపడుతున్నారు. అయితే ట్విట్టర్ లో హ్యాష్ ట్యాగ్ ఈ స్థాయిలో వైరల్ కావడాన్ని సీఎం జగన్ కూడా ఊహించి ఉండరు.

అయితే పవన్ కు సోషల్ మీడియాలో సపోర్ట్ చేసిన వాళ్లంతా పవన్ కు ఓట్లేస్తారా? అనే ప్రశ్నకు కాదనే సమాధానం వినిపిస్తోంది. ప్రజల్లో తనపై ఉన్న అభిమానాన్ని ఓట్లుగా మలచుకోవడంలో పవన్ కళ్యాణ్ ఫెయిలవుతున్నారు. గత ఎన్నికల సమయంలో పవన్ సభలకు ఊహించని స్థాయిలో జనాలు వచ్చారని అయితే ఎన్నికల్లో ఓట్లు మాత్రం ఆ స్థాయిలో రాలేదని కామెంట్లు వ్యక్తమయ్యాయి.