అమరావతి రాజధాని నిర్మాణాన్ని ఆపేస్తామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. బహిరంగంగా ఒక పార్టీ ఏకంగా రాజధాని నిర్మాణాన్ని ఆపేస్తామని ప్రకటించడం ఇదే తొలిసారి. మనకు కనిపించే రైతులే దేవుళ్లని పవన్ అన్నారు. రైతులకు అన్యాయం జరిగితే ప్రశ్నించే వారు కరువయ్యారని, ప్రభుత్వ విధానాలను అమలు చేస్తున్న అధికారులను తప్పు పడకూడదని ఆదేశాలు ఇస్తున్న చంద్రబాబును తప్పుపట్టాలని పవన్ వ్యాఖ్యానించారు. గోదావరి జిల్లాలో గోదావరి నది ప్రవహిస్తున్నా గోదావరి నీరు దక్కడం లేదని పవన్ అన్నారు. రాజధాని అభివృద్ది కోసమని లక్షల ఎకరాలు తీసుకుంటున్నారని ఇన్ని ఎకరాలు ఏం చేసుకుంటారాని పవన్ ప్రశ్నించారు. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు రైతుల ఆవేదన చూసే సదస్సు పెట్టానని పవన్ వ్యాఖ్యానించారు. ఏపీ ప్రభుత్వంలో ఆరాచకాలు పెరిగిపోతున్నాయని, మహిళా ఉద్యోగిని కొట్టిన ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోలేదు వారిపై రౌడీషీట్ పెట్టాలని పవన్ డిమాండ్ చేశారు. చంద్రబాబు చాలా తప్పులు చేస్తున్నారు. త్వరలో మహారాష్ట్ర తరహా రైతు ఉద్యమాలు చేస్తామని పవన్ హెచ్చరించారు.
ఇచ్చాపురం నుండి అనంతపురం వరకు రైతులంతా వచ్చి చంద్రబాబు ఇంటి ముందు కూర్చుంటారని పవన్ ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్పారు. చంద్రబాబు .. మీరేమి రాజులు కాదు.. ఇది రాజరికం కాదని పవన్ అన్నారు. భూసేకరణ చట్ట పరిరక్షణ సదస్సుకు రక్షణ లేదని, అందుకే రైతుల కన్నీళ్లు తుడిచేందుకు వారికి అండగా నిలవాలని అనుకుంటున్నానని పవన్ తెలిపారు. రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కుంటున్నారని ఇది మంచి పద్దతి కాదని వవన్ అన్నారు. నేను సభలు పెడుతుంటే ప్రభుత్వం ఎందుకు తనకు రక్షణ కల్పించటం లేదని పవన్ ప్రభుత్వాన్ని నిలదీశారు. 2014 లో టిడిపికి మద్దతు ఇచ్చానని, నేను చంద్రబాబు కలిసి రాజధాని గురించి చర్చించామని పవన్ తెలిపారు. కానీ చంద్రబాబు అన్నింటిని మరిచారన్నారు.
రైతులకు ఇబ్బంది లేకుండా అటవీ భూములు సేకరిస్తామని చంద్రబాబు తెలిపారు కానీ రాజధానిలో విధ్వంసకరంగా ప్రవర్తిస్తున్నారు. అమరావతి ఎప్పటికి పూర్తి చేస్తారు, ప్రజలు ఎప్పుడు అభివృద్ది చెందుతారని పవన్ ప్రశ్నంచారు. చంద్రబాబు గారు తప్పు చేస్తున్నారు రాష్ట్రంలో ఎక్కడ చూసినా కన్నీటి గాథలే కనిపిస్లున్నాయి ఇది సరైన పద్దతి కాదన్నారు. చంద్రబాబు నాయుడు మీది ఇష్టారాజ్యం కాదని ఇష్టం వచ్చినట్టు చేస్తే ఊరుకునేది లేదన్నారు. అందుకే వామపక్షాలతో కలిసి పోరాటం చేస్తున్నామని మేమే భవిష్యత్తులో మార్పు తీసుకు వస్తామని పవన్ అన్నారు.