టీడీపీ నేత పట్టాబిని చితక్కొట్టారా.? లేదా.?

‘నా మీదకే దూసుకొస్తాడా.? చూస్తూ ఎలా ఊరుకుంటాం.? తగిన శాస్తి చేశాం..’ అంటున్నారు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ. 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన వంశీ, ఆ తర్వాత వైసీపీలోకి దూకేసిన సంగతి తెలిసిందే. టీడీపీ నేత పట్టాబికి నోటి దురుసు ఎక్కువ. మరీ, వైసీపీ నేతలు కొడాలి నాని.. మంత్రి రోజా తరహాలో కాకపోయినా, పట్టాభి కూడా తక్కువేమీ కాదు, ‘నోరు జారడం’ విషయంలో. రోజా, నాని వైసీపీలో వున్నారు కదా.. అధికారంలో వున్నప్పుడు వాళ్ళకి ఆ మాత్రం ‘కొమ్ములు’ వుంటాయ్. అధికారం లేదు గనుక, టీడీపీ నేతలే కొంత ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలన్నది వైసీపీ ఉవాచ.

చట్టం, రాజ్యంగం.. అందరికీ ఒకేలా వర్తించాలి. కానీ, ఇది ఏ కాలం.? రాజకీయంగా ఇది పోయేకాలం.! సో, ఇక్కడ.. చట్టం, రాజ్యాంగం.. భిన్నంగా వర్తిస్తాయ్ ఆయా వ్యక్తులకి. ఇంతకీ, పట్టాభిని చితకబాదారా.? లేదా.? ముసుగేసుకుని వచ్చి తనను చావబాదారంటున్నారు పట్టాభి. అప్పుడెప్పుడో రఘురామకృష్ణరాజు కూడా ఇలాగే చెప్పారు. పోలీసులు కొడతారా.? కస్టడీలో కొడితే అదెంత పెద్ద నేరమవుతుందో పోలీసులకు తెలియదా.?

అయినా, విషయం బయటకు వస్తేనే కదా.. అది నేరమా.? కాదా.? అన్నది తేలేది. రఘురామకృష్ణరాజు ఇప్పటికీ, ‘కొట్టారు’ అన్నదానిపై ‘న్యాయం’ పొందలేకపోతున్నారు. అదంతే, అలాగే వుంటుందంతే. మామూలుగా అయితే తన్నులు తిన్నాసరే, తిన్లేదని చెప్పడం రాజకీయ నాయకులకు అలవాటు. ఇప్పుడేమో తన్నులు తిన్నారో లేదో తెలియదు.. కానీ, తన్నులు తిన్నామంటున్నారు. పోలీసు వ్యవస్థకి పెద్ద తలనొప్పే ఇది.!