షాకింగ్: వైసీపీ నేతలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన పరిటాల సునీత

టీడీపీ మంత్రి పరిటాల సునీత శనివారం శ్రీకాకుళం జిల్లా తిత్లీ తుఫాను బాధిత ప్రాంతాల్లో పర్యటించారు. శనివారం ఆమె శ్రీకాకుళం పరిస్థితులపై మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె ప్రతిపక్షంపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆమె చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు దారి తీశాయి. ఇంతకీ ఆమె ఏం మాట్లాడారో చూడండి.

ప్రభుత్వం చేపడుతున్న సహాయకచర్యలపై విపక్షాలు విమర్శలు చేస్తున్నాయని, ప్రజల్లోకి వచ్చి చూస్తే తెలుస్తుందని వెల్లడించారు. నిన్న 12 గ్రామాల్లో తిరిగానని చెప్పిన సునీత ప్రజలు తనను ఆప్యాయంగా ఆహ్వానించారని అన్నారు. “తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు చేస్తున్న సహాయక కార్యక్రమాలను అభినందిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు నేతలు చెప్పారని తెలిపారు. ఆమె వద్దకు వచ్చి ఆ ఇద్దరు నేతలు సీఎం చంద్రబాబు నాయుడుని పొగిడారని, సహాయక చర్యలు బాగా చేస్తున్నారని మెచ్చుకున్నట్టు సునీత పేర్కొన్నారు. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వచ్చి దగ్గరుండి సహాయం చేసేవారే నాయకులని, అలాంటివారి గురించి చెప్పడం తమ ధర్మమని వారు అన్నట్టు” సునీత తెలిపారు.

కాగా ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. రాజకీయ వర్గాల్లో ఈ విషయం తీవ్ర దుమారం రేపుతోంది. ఆ ఇద్దరు నేతలు ఎవరా అని బుర్రలు బద్దలు గొట్టుకుంటున్నాయి రాజకీయ వర్గాలు. ఇటు వైసీపీ శ్రేణులు సైతం ఈ విషయంపై ఎంక్వైరీ మొదలెట్టారు. అధికార ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టడంలో విఫలమైందంటూ విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే టీడీపీ తమ నేతలపై ఇటువంటి దుష్ప్రచారం మొదలెట్టింది అని వైసీపీ నేతలు ఆమె వ్యాఖ్యలను ఖండించే ప్రయత్నం చేస్తున్నాయి. అయినప్పటికీ ఆ ఇద్దరు నేతలు ఎవరై ఉంటారా అని సర్వత్రా చర్చ నడుస్తోంది.

జగన్ పార్టీని మరింత బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తుంటే ఆ ఇద్దరు నేతలు చేసిన పని ప్రత్యర్థి పార్టీకి బలాన్ని చేకూర్చేలా ఉన్నాయని కొందరు వైసీపీ అభిమానులు ఆగ్రహిస్తున్నారు. ఇప్పటికే రానున్న ఎన్నికల్లో అధికారాన్ని దక్కించుకోవడమే లక్ష్యంగా కృషి చేస్తున్న జగన్ కి ఇలాంటివన్నీ చికాకు తెప్పించే విషయాలుగా వారు భావిస్తున్నారు. ఒక పక్క సహాయక చర్యలు సరిగా జరగట్లేదు అని విమర్శిస్తూ, మరోవైపు వారిని పొగడటం సరైనది కాదని అంటున్నారు. ఆ ఇద్దరు నేతలపై జగన్ చర్యలు తీసుకోవాలని ఆశిస్తున్నారు.