పరిపూర్ణానంద స్వామికి హైకోర్టులో ఊరట

పరిపూర్ణానంద స్వామికి హైకోర్టులో ఊరట లభించింది. పరిపూర్ణానంద స్వామిపై ఉన్న నగర బహిష్కరణను ఎత్తివేస్తూ హైకోర్టు స్టే ఇచ్చింది. కత్తి మహేష్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో హైదరాబాద్ నుంచి యాదాద్రి  వరకు ధార్మిక చైతన్య యాత్ర చేస్తానని పరిపూర్ణానంద ప్రకటించడంతో పోలీసులు స్వామి యాత్రకు అనుమతివ్వలేదు. హౌజ్ అరెస్టు చేశారు. యాత్ర చేస్తే ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందని చెప్పినా పరిపూర్ణానంద స్వామి తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. మత ఘర్షణలు ఏర్పడే అవకాశం  ఉందని, వివాదాలు తలెత్తుతాయని పరిఫూర్ణానంద స్వామిపై ఆరు నెలల పాటు హైదరాబాద్ సీపీ నగర బహిష్కరణ చేశారు. పరిపూర్ణానందపై నగర బహిష్కరణ విధించి నెలరోజులైంది.

నగర బహిష్కరణను సవాల్ చేస్తూ హైకోర్టులో పరిపూర్ణానంద పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ ను విచారించిన హైకోర్టు నగర బహిష్కరణను ఎత్తివేస్తూ దానిపై స్టే విధించింది. దీంతో పరిపూర్ణానంద హైదరాబాదుకు వచ్చే అవకాశం ఉంది. పరిపూర్ణానంద పై నగర బహిష్కరణ ఎత్తివేయడంతో స్వామి మద్దతుదారులు, శిష్యులు ఆనందం వ్యక్తం చేశారు.