లడ్డాక్ సరిహద్దులో పాకిస్తాన్ యుద్దానికి సన్నద్ధం ?

లడ్డాక్ సరిహద్దులో పాకిస్తాన్ యుద్దానికి సన్నద్ధం ?

కాశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు తరువాత పాకిస్తాన్ తన దేశ ప్రజలకు ఎదో అన్యాయం జరిగిపోయినట్టు విలవిలలాడి పోతోంది . తన బాధను పక్క దేశాలతో పంచుకోవాలని చూసినా ఎవరు ఆ దేశాన్ని పెద్ద పట్టించుకోలేదు . భారత దేశం నుంచి ప్రతిరోజూ తన దేశంలోకి అనుమతించే కూరగాయలను సైతం బ్యాన్ చేసింది . ఫలితంగా పాకిస్తాన్ ఇప్పుడు కూరగాయలు లేక అల్లాడిపోతోంది . అయినా పాకిస్థాన్కు బుద్ది రాలేదు . తాజాగా భారత దేశంపై యుద్ధం చెయ్యడానికి మిలిటరీ సన్నాహాలు చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి .

కాశ్మీర్ లోని లడ్డాక్ కు సమీపంలో ని పాకిస్తాన్ భూభాగంలో వున్న ఫార్వర్డ్ ఎయిర్ బేస్ కు యుద్ధ విమానాలను తరలిస్తున్నట్టు మన సైన్యం పసిగట్టింది . లడ్డాక్ సమీపంలోని పాకిస్తాన్ భూభాగంలోని స్కర్ట్ ఎయిర్ బేస్ కు భారీగా యుద్ధ విమానాలు , సైన్యం , సైనిక పరికరాలను సి 130 ట్రాన్స్ పోర్ట్ విమానాల ద్వారా చేరవేస్తున్నట్టు మన సైనిక అధికారులు గుర్తించారు . ఈ చర్యతో భారత ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది . పాకిస్తాన్ సైనిక చర్యలను భారత నిఘా వర్గం ఎప్పటికప్పుడు పరిశీలిస్తుంది . ఎలాంటి పరిస్థితులనైనా మన సైన్యం ఎదుర్కొనే సత్తా ,సామర్ధ్యం వున్నాయి