జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద ‘ప్యాకేజీ స్టార్’ అన్న విమర్శలున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు ఇచ్చే ప్యాకేజీ మేరకే చంద్రబాబు రాజకీయాలు చేస్తారన్నది పదే పదే అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేసే ఆరోపణ. ఇదో మైండ్ గేమ్.!
ఇక, అసలు విషయానికొస్తే.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇంటికి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు వెళ్ళారు. చంద్రబాబునాయుడికి పవన్ కళ్యాణ్ సాదరంగా ఇంట్లోకి ఆహ్వానించారు. పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజ్‌నెవా ఫొటోలు కూడా బయటకు వచ్చాయి.
చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ మధ్య రాజకీయ అంశాలు చర్చకు వచ్చాయి. జనసేన కీలక నేతల్లో నాదెండ్ల మనోహర్ ఒకరు. నాదెండ్ల మనోహర్ లేకుండా, పవన్ కళ్యాణ్ ఎలాంటి రాజకీయ చర్చలూ జరపడం లేదు.
ఇంతకీ, చంద్రబాబు – పవన్ కళ్యాణ్ మధ్య ఎలాంటి చర్చలు జరిగాయి.? సీట్ల పంపకాలపై చర్చ జరిగిందా.? నారా లోకేష్ ‘యువగళం’ పాదయాత్ర ముగింపు సభకు సంబంధించిన చర్చలు జరిగాయా.? అంటే, దీనిపై భిన్న వాదనలున్నాయి.
యువగళం పాదయాత్ర ముగింపు కార్యక్రమానికి పవన్ కళ్యాణ్‌ని చంద్రబాబు ఆహ్వానించి వుంటారంటూ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ విషయమై జనసేన పార్టీ నుంచి ఓ ప్రకటన రావాల్సి వుంది. టీడీపీ మాత్రం, జనసేనాని ఆ కార్యక్రమానికి హాజరవుతారని అంటోంది.
కాగా, జనసేన – టీడీపీ మధ్య చర్చలు అత్యంత సానుకూల వాతావరణంలో జరిగాయనీ, జనసేన పోటీ చేయబోయే సీట్ల గురించిన చర్చతోపాటు, ఆయా స్థానాల్లో జనసేన అభ్యర్థుల ఖర్చు టీడీపీనే పెట్టుకునేలా చంద్రబాబు ప్రతిపాదన తీసుకొచ్చారనీ అంటున్నారు.
25 సీట్ల వరకూ జనసేనకు టీడీపీ ఇవ్వొచ్చన్నది టీడీపీ అను‘కుల’ మీడియా నుంచి జరుగుతున్న ప్రచారం.! కానీ, జనసేన శ్రేణులు ఈ ప్రచారాన్ని తిప్పి కొడుతున్నాయి.