పంచాయతీ కార్యదర్శి, ఆర్ ఆర్ బీ పరీక్షలు రెండు ఒకే రోజున ఉన్నందున పంచాయతీరాజ్ పరీక్షను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ ఓయూ ఆర్ట్స్ కళాశాల ముందు ఓయూ విద్యార్ధి పెట్రోల్ పోసుకోని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. దీంతో అక్కడే ఉన్న మరికొందరు విద్యార్ధులు అడ్డుకోగా పోలీసులు విద్యార్ధిని అదుపులోకి తీసుకున్నారు. విద్యార్ధి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ వీడియో కింద ఉంది చూడండి.
తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో పంచాయతీ సెక్రటరీ పరీక్షను అక్టోబర్ 10 బుధవారం నిర్వహిస్తున్నారు. అదే రోజు ఆర్ ఆర్ బీ, ఎస్ ఎస్ సీ పరీక్షలు ఉండటంతో నిరుద్యోగులంతా పంచాయతీ కార్యదర్శి పరీక్షను వాయిదా వేసి మరో తేదిన పెట్టాలని కోరారు. కానీ ప్రభుత్వం మాత్రం పట్టించుకోకుండా పరీక్షను వాయిదా వేయలేదు.
ఎన్నో ఏళ్ల నుంచి ప్రిపేర్ అవుతుంటే అన్ని పరీక్షలు ఒకే సారి వచ్చాయని అసలు ఏ పరీక్ష రాయాలో తేల్చుకోలేని పరిస్థితి ఉందని అందుకే పరీక్ష వాయిదా వేసి మరో తేదిన పెట్టాలని కోరారు. అప్పులు చేసి కోచింగ్ సెంటర్లల్ల తిరుగుతూ తిండి లేక తిప్పలు లేక రోడ్ల వెంటే బతుకుతూ చదువుతుంటే తెలంగాణ ప్రభుత్వం పరీక్షలు వాయిదావేయదా అంటూ నిరుద్యోగులు మండి పడుతున్నారు. ఊరిడిచి ఇల్లుడిచి అప్పులు చేసి చదువుకుంటుంటే ఏదో ఒక పరీక్షను మాత్రమే రాయాల్సి వస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పెట్టమన్న పరీక్షలు పెట్టని ప్రభుత్వం ఎన్నికల వేళ ప్రచారం కోసం పంచాయతీ పరీక్షలు పెడుతుందని వారు విమర్శించారు.
విద్యార్ధి ఆత్మహత్యాయత్నంతో మరికొంత మంది విద్యార్ధులు రోడ్డు పై బైఠాయించి నిరసన తెలిపారు. ర్యాలీగా ఓయూ నుంచి బయల్దేరగా అడ్డుకున్నారు. విద్యార్దులకు , పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. దీంతో పోలీసులు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తును ఏర్పాటు చేశారు.
వీటికి తోడు పంచాయతీ కార్యదర్శి పరీక్షకు కఠిన నిబంధనలు పెట్టారు. అవి కూడా నిరుద్యోగులకు ఆందోళన కలిగిస్తున్నాయి.
జెఎన్టీయూ పెట్టిన కఠిన నిబంధనలివే…
పరీక్ష హాల్ లోకి బూట్లు, బంగారు నగలు వేసుకోని రావద్దు
వాచ్ లు, కాలిక్యూలేటర్లు, ఫోన్ లు తీసుకురావద్దు
సాధ్యమైనంత వరకు ఫార్మల్ డ్రెస్ లోనే రావాలి
పరీక్షకు ఎంటర్ అయిన తర్వాత పరీక్ష అయిపోయే వరకు బయటికి పంపరు
ఉదయం పేపర్ 1 పరీక్షకి 9 నుంచి 10 గంటల వరకు అనుమతిస్తారు. మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు అనుమతిస్తారు. నిమిషం లేటైనా పరీక్షకు అనుమతించరు. ఉదయం పది నుంచి 12 వరకు పేపర్ 1, మధ్యాహ్నం 3 నుంచి 5 వరకు పేపర్ 2 పరీక్షలు ఉంటాయి.
బ్లూ లేదా బ్లాక్ పెన్నుతోనే పరీక్ష రాయాలి
అనవసర పేపర్లు, పర్సులు ఉండరాదు
హాల్ టికెట్ రానివారు వెబ్ సైట్ లో ఉన్న ఫోన్ నంబర్లను సంప్రదించాలి లేదా పని దినాలలో నేరుగా కార్యాలయానికి వచ్చి ఫిర్యాదు చేయవచ్చు.
హాల్ టికెట్ లో పోటోలు రానివారు రెండు ఫోటోలు తెచ్చుకొని సూపరిండెంట్ తో సంతకం చేయించుకోని పరీక్షకు హాజరు కావాలి.
పరీక్ష కేంద్రానికి 8 గంటలకే చేరుకోవాలి. దూరం ఉన్న వారు ముందు రోజు వెళ్లాలి. బస్సుల కొరత ఉంటుంది కాబట్టి ముందుగా బయల్దేరేట్టు ప్లాన్ చేసుకోవాలి.
పరీక్ష అయిపోయిన తర్వాత క్వశ్చన్ పేపర్, ఆన్సర్ షీట్ రెండు ఇచ్చి వెళ్లాలి. ఎవరైనా ఇవ్వక పోతే వారి పై క్రిమినల్ కేసులు పెట్టి భవిష్యత్తులో ప్రభుత్వ పరీక్షలు రాయకుండా చేస్తామని జెఎన్టీయూ పరీక్ష నిర్వహణాధికారులు తెలిపారు.
టిఆర్ ఎస్ సభలున్న రోజు పనికి పోనక్కర్లేదట రూ.500, బీరు, బిర్యానీ ఫ్రీ అట https://bit.ly/2IAP6fY