ఏపీ రైతులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. రైతు భరోసా నగదు జమ కానుందా?

ఏపీ సీఎం వైఎస్ జగన్ రైతులకు ప్రయోజనం చేకూరేలా ఎన్నో సంక్షేమ పథకాలను రాష్ట్రంలో ఇప్పటికే అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. వైఎస్సార్ రైతు భరోసా స్కీమ్ ద్వారా ఆంధ్రప్రదేశ్ రైతులకు ఏపీ ప్రభుత్వం మూడు విడతల్లో 7500 రూపాయలు జమ చేస్తోంది. పీఎం కిసాన్ స్కీమ్ తో పాటు రైతుల ఖాతాలలో ఈ నగదు జమవుతోంది. ఈ స్కీమ్ ద్వారా ఏపీ రైతులకు పెట్టుబడి సాయం అందుతోంది.

రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నా జగన్ సర్కార్ ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. జగన్ రైతు భరోసా నిధులను రేపు విడుదల చేయడంతో పాటు పంట నష్టపోయిన రైతులకు ఇన్ పుట్ సబ్సిడీని సైతం జమ చేయనున్నారని సమాచారం అందుతోంది. జగన్ రైతు భరోసా నిధులను విడుదల చేస్తుండటంతో రైతుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

చాలా ప్రభుత్వాలు తమ ప్రభుత్వాలు రైతు సంక్షేమ ప్రభుత్వాలు అని చెప్పుకున్నా ఆచరణలో మాత్రం అందుకు విభిన్నంగా వ్యవహరిస్తున్నాయి. అయితే జగన్ సర్కార్ మాత్రం రైతులకు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటోంది. రైతు భరోసా స్కీమ్ తో పాటు వైఎస్సార్ జలకళ, భూ సర్వే, పంట నష్ట పరిహారాలు, సబ్సిడీల కోసం జగన్ సర్కార్ వేర్వేరు స్కీమ్స్ ను అమలు చేస్తోంది.

రైతులకు మంచి ధరలు లభించేలా జగన్ సర్కార్ అడుగులు వేస్తోంది. జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత వాణిజ్య పంటలకు రేట్లు కూడా ఊహించని స్థాయిలో పెరిగాయనే సంగతి తెలిసిందే. రైతులకు నష్టం రాకూడదనే ఉద్దేశంతో జగన్ సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకుంటోందని కామెంట్లు వినిపిస్తున్నాయి.