విశాఖకు వరుస కంపెనీలు.. జగన్ కోరుకున్న అభివృద్ధి జరిగినట్టేనా?

ఏపీ రాజధాని విశాఖ అభివృద్ధి దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. ఏపీ రాజధాని విశాఖకు వరుసగా కంపెనీలు క్యూ కడుతున్నాయి. ఇప్పటికే విశాఖలో ఇన్ఫోసిస్ సంస్థ కార్యకలాపాలు మొదలు కాగా త్వరలో విశాఖలో రాండ్ స్టడ్ కంపెనీ కూడా ల్యాండ్ కాబోతుంది. జగన్ సర్కార్ కృషి వల్లే విశాఖకు వరుస కంపెనీలు క్యూ కడుతున్నాయని కామెంట్లు వినిపిస్తున్నాయి. వైఎస్సార్ సీఎంగా ఉన్న సమయంలో విశాఖలో ఐటీ దిశగా అడుగులు పడ్డాయి.

చంద్రబాబు హయాంలో విశాఖకు ప్రాధాన్యత తగ్గినా జగన్ సర్కార్ విశాఖపై ప్రత్యేక దృష్టి పెట్టడం గమనార్హం. ఇప్పటికే ఈ సంస్థ చెన్నైలో ఉండగా విశాఖలో రెండో బ్రాంచ్ ను ఏర్పాటు చేసింది. విశాఖకు వైసీపీ ఏం చేసిందనే ప్రశ్నకు నెమ్మదిగా ఇతర పార్టీలకు సైతం సమాధానాలు దొరుకుతున్నాయి. జగన్ సర్కార్ విశాఖ ప్రజలకు ప్రయోజనం చేకూరే దిశగా అడుగులు వేస్తుండటంతో విశాఖ ప్రజలు సంతోషిస్తున్నారు.

మరో 18 నెలల్లో జగన్ విశాఖను మరింత అభివృద్ధి చేసే దిశగా అడుగులు వేస్తుండటం గమనార్హం. అదే సమయంలో జగన్ సర్కార్ విశాఖతో పాటు ఇతర ప్రాంతాల అభివృద్ధిపై కూడా ప్రధానంగా దృష్టి పెట్టింది. మరిన్ని కంపెనీలు విశాఖలో అడుగు పెడితే మాత్రం విశాఖ అభివృద్ధి దిశగా అడుగులు పడే ఛాన్స్ అయితే ఉందని చెప్పవచ్చు.

మూడు రాజధానుల నిర్ణయాన్ని అమలు చేయాలని జగన్ సర్కార్ ప్రయత్నాలు చేస్తుండగా ఆ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయో లేదో చూడాల్సి ఉంది. జగన్ సర్కార్ మాత్రం మూడు రాజధానుల నిర్ణయం అమలు చేయడానికి తన వంతు ప్రయత్నాలు చేస్తుంది. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో ఏం జరగనుందో చూడాల్సి ఉంది.