ఆంధ్రప్రదేశ్ లో తొలివిడత పంచాయతీ పోరుకు రంగం సిద్ధం అయింది. దీనికోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే తొలి విడత ఎన్నికల ప్రచారానికి తెరపడింది. దాంతో ఎన్నికల నిర్వహణలో అధికారులు ఉన్నారు. అయితే ఇవాళ, రేపు రాయలసీమలో పర్యటించనున్నారు. ఎన్నికల సరళిని దగ్గరుండి పర్యవేక్షించనున్నారు. ఎన్నికల అధికారులతో ఎప్పకప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ బీజీగా గడుపుతున్నారు. ఇవాళ కడప జిల్లాలో మరోసారి పర్యటించనున్నారు ఎస్ఈసీ నిమ్మగడ్డ. ఎన్నికల ముందు రోజు కడపలో పర్యటించడం అందరిలో ఉత్కంఠగా మారింది.
కడప జిల్లాలో పంచాయతీ పోరు రక్తికట్టిస్తోంది. ఇప్పటికే ప్రభుత్వానికి, రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు మధ్య వార్ లా మారిన ఈ ఎన్నికల్లో గెలుపొందేందుకు అధికార పార్టీ వ్యూహ రచనల్లో ఉంది. అయితే.. ఇదే సమయంలో ఎన్నికల కమిషన్ భరోసాతో ప్రతిపక్ష టీడీపీ కూడా తన సత్తా చాటేందుకు సమాయత్తమైంది. ఎన్నికలకు సంబంధించి ఎస్ఈసీ నిమ్మగడ్డ ఎప్పకప్పుడు పర్యవేక్షిస్తున్నారు. అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు.
ఇప్పటికే ఒకసారి పర్యటించిన ఎస్ఈసీ.. ఇప్పుడు ఎన్నికలకు ఒకరోజు ముందు కడప జిల్లాలో పర్యటించడం ఆసక్తిగా మారింది. కడప జిల్లాలో తొలి విడతలో 206 పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. 51 సర్పంచి స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. దీంతో మిగిలిన 155 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఈరోజు మధ్యాహ్నం కడప జిల్లాలో పర్యటిస్తారు. అక్కడినుంచి రాత్రికి అనంతపురం చేరకుంటారు. రేపు అనంతపురం జిల్లాలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ పర్యటించనున్నారు.