ఆంధ్ర ప్రదేశ్ : రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం ఈ నెల 25న ప్రారంభిస్తున్న పథకంపైనే ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతుంది . రాష్ట్రంలో ఆ రోజు ఏకంగా 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలు పంపిణీ చేసే బృహత్తర కార్యక్రమానికి ఏపీ జగన్ శ్రీకారం చుట్టారు. అనివార్య కారణాల వల్ల ఇప్పటికే ఈ కార్యక్రమం నాలుగు సార్లు వాయిదా పడుతూ వచ్చింది.ఎట్టకేలకు ఈ నెల 25న ఇళ్ల పట్టాలతో ఇళ్ల నిర్మాణం కూడా అదే రోజు ప్రారంభిస్తున్నారు.
ఇలాంటి కార్యక్రమం మన దేశంలో ఇప్పటి వరకు ఏ ఒక్క సీఎం చేయలేదట.వాస్తవానికి గత ఎన్నికల ప్రచారంలోనే జగన్ తాను అధికారంలోకి వచ్చిన వెంటనే 25 లక్షల ఇళ్లను కట్టించి ఇస్తానని మేనిఫెస్టోలో హామీ ఇచ్చినప్పుడు చాలా మంది అపహాస్యం చేశారు. ఇప్పుడు అధికారం లో కి వచ్చిన తరువాత ఆయన ఇచ్చిన మాటని నిజం చేయబోతున్నారు.
జగన్ సీఎం అయిన తరువాత ప్రభుత్వ భూములు ఎక్కడ ఉన్నాయో గుర్తించి వెంటనే వాటిని ప్లాట్లుగా విభజించి లబ్ధిదారులను గుర్తించి వారికి కేటాయించారు. రాష్ట్రంలో ఎన్నో ఖాళీ భూములకు అనుమతులు రావడం మామూలు విషయం కాదు. ప్రభుత్వ పరిధిలో ఉన్న భూములతో పాటు దాదాపుగా 20 వేల ఎకరాలను ప్రైవేటు వ్యక్తుల నుంచి కొనుగోలు చేసి ఈ పంపిణీ చేస్తున్నారు.ఓవరాల్‌గా రాష్ట్రంలో ఎంతో మంది పేదలకు ఈ ఇళ్ల నిర్మాణంతో లబ్ధి జరుగుతోంది.రాష్ట్రంలో ఇళ్లు లేని వారు అంటూ ఉండకూడదు అన్నదే సీఎం లక్ష్యం అని వైసీపీ వర్గాలు చెప్తున్నాయి.