బాలయ్యకు రోజా కౌంటర్లు.. నందమూరి హీరోకు ఇలాంటి పరిస్థితా?

బాలకృష్ణ, రోజా కాంబినేషన్ లో పలు సినిమాలు తెరకెక్కగా ఆ సినిమాలలో మెజారిటీ సినిమాలు సక్సెస్ సాధించాయనే తెలిసిందే. అటు బాలకృష్ణ ఇటు రోజా వేర్వేరు పార్టీలకు చెందిన వ్యక్తులే అయినా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్న సందర్భాలు చాలా తక్కువనే సంగతి తెలిసిందే. అయితే తొలిసారి రోజా బాలయ్యపై ఘాటుగా స్పందించారు. జగన్ ను పొగిడే క్రమంలో రోజా చేసిన కామెంట్లు హద్దులు దాటాయనే సంగతి తెలిసిందే.

ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్పు గురించి బాలయ్య తాజాగా స్పందించగా రోజా సోషల్ మీడియాలో బాలయ్యా ఫ్లూట్ జింక ముందు ఊదు.. జగన్ ముందు కాదు, అక్కడ ఉంది రీల్ సింహం కాదు జగన్ అనే రియల్ సింహం తేడా వస్తే దబిడి దిబిడే అని రోజా కామెంట్ చేశారు. అయితే రోజా కౌంటర్ ఇచ్చిన విధానం సరికాదని చాలామంది కామెంట్లు చేస్తున్నారు. భవిష్యత్తులో టీడీపీ అధికారంలోకి వచ్చి వైఎస్సార్ పేరును మారిస్తే ఇదే విధంగా రోజా స్పందిస్తారా అని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.

రోజా ఒకప్పుడు టీడీపీలో ఉన్నారని ఆమె వైఎస్సార్ పై ఎన్నో సందర్భాల్లో విమర్శలు చేశారని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం. రోజా కామెంట్ల గురించి బాలయ్య ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడల్సి ఉంది. తండ్రి పేరుతో ఉన్న హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చడంతో బాలయ్యకు ఆ మాత్రం బాధ ఉంటుందని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు.

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వివాదం విషయంలో రోజా అనవసరంగా జోక్యం చేసుకున్నారని మరి కొందరు కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్లు వైరల్ అవుతున్నాయి. రోజా మంత్రి అయ్యాక ఏం చేశారో చెప్పాలంటూ మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు. మంత్రి పదవి వచ్చాక టీవీ షోలకు గుడ్ బై చెప్పిన రోజా మళ్లీ అడపాదడపా టీవీ కార్యక్రమాలకు ఎందుకు హాజరవుతున్నారని మరి కొందరు ప్రశ్నిస్తున్నారు. ఆఖరికి రోజా చేత కూడా నందమూరి బాలకృష్ణ తిట్టించుకుంటున్నారని మరి కొందరు ఆవేదన వ్యక్తం చేశారు.