చినబాబుని ఓ రేంజ్ లో ఆడుకుంటున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్!

గతంతో పోలిస్తే.. తెలుగుదేశం పార్టీ భవిష్యత్ ఆశాకిరణంగా చెప్పుకుంటున్న నారా లోకేష్ వాక్ చాతుర్యం చాలా మెరుగుపడిందనే చెప్పుకోవాలి! ఒకప్పుడైతే చినబాబు మైకందుకుంటే.. టీడీపీ నేతలకు వణుకు పుట్టేది. కానీ… ఇప్పుడు పరిస్థితులు కాస్త మెరుగయ్యాయి.. కానీ, ఏ అంశానికి ఏస్థాయిలో, ఎలా రెస్పాండ్ అవ్వాలన్నదే ఇంకా మెరుగుపడాలనే కామెంట్లు వినిపిస్తున్నాయి!

ఒకప్పుడు చినబాబు మైక పట్టుకుంటే… ప్రత్యర్ధుల సంగతి దేవుడెరుగు.. సొంతపార్టీ నేతలకు ఏసీలో కూడా ముచ్చెమటలు పట్టేవి! ఎందుకంటే… అప్పట్లో చినబాబు పాండిత్యం ఆ రేంజ్ లో ఉండేది! అయితే “యువగళం” పాదయాత్ర పుణ్యమాని కాస్త బెటర్ ట్రైనింగ్ ఇవ్వడం వల్లో ఏమో కానీ చినబాబు పలుకుల్లో చాలా తేడా వచ్చింది. తప్పుల సంఖ్య చాలా వరకూ తగ్గింది!

అయితే.. ఏ ప్రశ్నకు అలా స్పందించాలి అన్నది మాత్రం ఇంకా నేర్చుకోలేదనేది కొత్త విమర్శ! అందుకు కారణమైంది… జూనియర్ ఎన్టీఆర్ విషయంలో చినబాబు స్పందించిన విధానం! జూనియర్ ఎన్టీఆర్ ని పార్టీలోకి ఆహ్వానిస్తారా అన్న ప్రశ్నకు స్పందించిన చినబాబు… ఎవరైనా రావొచ్చు అనే సౌండ్ ఇవ్వడంతో నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు!

నందమూరి తారకరామారావు స్థాపించిన టీడీపీ విషయంలో చినబాబు లోకేష్ కి ఎంత హక్కు ఉందో.. అంతకంటే ఎక్కువ హక్కే ఎన్టీఆర్ కి ఉందనేదినెటిజన్ల సెటైర్! అసలు ఎన్టీఆర్ పార్టీలోకి రావాలనుకుంటే… ఎవరూ ఆయన్ని ఆహ్వానించక్కరలేదు.. అసలు ఎన్టీఆర్ రంగంలోకి దిగితే.. చినబాబు కి పెద్ద స్ట్రోక్ తగిలినట్లే!

దీంతో… నిజంగా చినబాబు యువగళం అని చేస్తున్న పాదయాత్రకు వస్తున్న స్పందన కూడా ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. లోకేష్ యువగళం స్థానే.. ఎన్టీఆర్ పాదయాత్ర గనక చేస్తే… పరిస్థితి ఎలా ఉండేదో అనేది మరో మాట! ఎందుకంటే… చినబాబు ఫాలోయింగ్ కి జూనియర్ ఫాలోయింగ్ కీ అసలు పొంతనే లేదనేది ఆయన ఫ్యాన్స్ మాట!

ఏ రకంగా చూసుకున్నా తెలుగుదేశంపై హక్కులు ఎన్టీఆర్ కి ఉన్నాయని.. ఆయనను పార్టీలోకి ఎవరూ ఆహ్వానించక్కర్లేదని.. ఆయన కు ఆయన రావాలనుకుంటే.. ఎవరూ ఆపలేరని.. సీరియస్ అయిపోతున్నారు జూనియర్ ఫ్యాన్స్! మనసుమారి ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే.. అప్పుడు తెలుస్తాది.. ఎవరు ఎవరిని ఆహ్వానించాలో అని మరో సెటైర్స్ వేస్తున్నారు నందమూరి ఫ్యాన్స్!