వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె కాబట్టి, వైఎస్ షర్మిలా రెడ్డి అనే పేరు రావడం సహజమే.! కానీ, అది పెళ్ళయ్యేవరకే. పెళ్ళయ్యాక ఇంటి పేరు మారిపోతుంది. కొందరు, తమ ఇంటి పేరుని పెళ్ళయ్యాక కూడా మార్చుకోవడానికి ఇష్టపడరు.. అది వేరే సంగతి.
ఇంతకీ, వైఎస్ షర్మిల ప్రస్తుత పేరు ఏంటి.? ఇంకేంటి.? వైఎస్ షర్మిల.! పేరు చివర్న ‘రెడ్డి’ మాత్రం ఎప్పుడూ లేదు. షర్మిల పేరు ముందర వైఎస్ మాత్రం అలాగే వుంది. ప్రస్తుత భర్త ‘బ్రదర్’ అనిల్ కుమార్‌తో ఆమెది రెండో వివాహం. అంతకు ముందు వివాహ బంధం ఏమయ్యింది.? అంటే అది వేరే చర్చ.
ప్రస్తుతం వైఎస్ షర్మిల పేరు మెరుసుమల్లి షర్మిల శాస్త్రి అట.! అలాగని వైసీపీ సోషల్ మీడియా టీమ్ పెద్దయెత్తున ట్వీట్లు వేస్తోంది. ఇప్పటిదాకా వైఎస్ షర్మిలను, వైఎస్ జగన్‌తో సమానంగా అభిమానించిన వైసీపీ సోషల్ మీడియా విభాగం, ఎప్పుడైతే షర్మిల కాంగ్రెస్ వైపు టర్న్ తీసుకున్నారో, అప్పటినుంచి రూటు మార్చింది.
వాస్తవానికి, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే షర్మిల కాంగ్రెస్ టర్న్ తీసుకున్నారు. అయితే, అప్పుడామెని పెద్దగా ట్రోల్ చేయలేదు వైసీపీ సోషల్ మీడియా విభాగం. ఇప్పుడు మాత్రం ఆమెను రాజకీయంగా టార్గెట్ చేసేసింది వైసీపీ సోషల్ మీడియా టీమ్.
ఓ మహిళను, పైగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరిని ఇలా టార్గెట్ చేసి ఏం సాధిస్తారు.? ఈ విషయమై వైసీపీ అధినాయకత్వం తమ సోషల్ మీడియా విభాగాన్ని కంట్రోల్ చేసుకుంటేనే మంచిది. లేకపోతే, ముందు ముందు డ్యామేజీ చాలా దారుణంగా వుంటుంది.
షర్మిలతో సరిపెడతారా.? వైఎస్ విజయమ్మ వరకూ వైసీపీ సోషల్ మీడియా విభాగం వెళుతుందా.? వెళితే మాత్రం, ఆ డ్యామేజీ వైసీపీ పతనానికి దారి తీస్తుంది. అందరూ కాదుగానీ, చాలామంది వైసీపీ మద్దతుదారులైన నెటిజన్లు అటు షర్మిలతోపాటు, ఇటు విజయమ్మనీ టార్గెట్ చేస్తున్నారు.
ఇదే సోషల్ మీడియా టీమ్ గతంలో వైఎస్ వివేకానందరెడ్డికి అక్రమ సంబంధాల్ని అంటగట్టిన సంగతి తెలిసిందే.