వెయ్యి రోజుల పోరాటం.. అమరావతి రైతులు అసలేం సాధించారో?

వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం జగన్ మూడు రాజధానుల నిర్ణయాన్ని ప్రకటించటంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రజల నుంచి ప్రశంసలు వ్యక్తమయ్యాయి. విశాఖను రాజధానిగా చేయడం వల్ల ప్రభుత్వంపై ఆర్థిక భారం తగ్గే ఛాన్స్ ఉందని రాష్ట్ర అభివృద్ధి కూడా వేగంగా జరిగే ఛాన్స్ ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి. రాజధానికి విశాఖ అనుకూలమైన ప్రాంతమని చాలామంది అభిప్రాయాలు వ్యక్తం చేశారు.

అయితే మూడు రాజధానుల నిర్ణయానికి అనుకూలంగా ప్రభుత్వం అడుగులు వేసినా ప్రతిపక్షాలు మాత్రం కోర్టుల ద్వారా ఏపీ ప్రభుత్వం నిర్ణయాలకు అడ్డు తగులుతున్నాయి. జగన్ సర్కార్ మాత్రం కోర్టుల నుంచి ఎలాంటి ఇబ్బందులు రాకుండా ప్రస్తుతం అడుగులు వేస్తోంది. మరోవైపు వచ్చే నెల 12వ తేదీకి అమరావతి ఉద్యమం మొదలై 1,000 రోజులవుతుంది. అమరావతి రాజధానిగా ఉండాలని అమరావతి రైతులు కోరుతున్నారని టీడీపీ చెబుతోంది.

వెయ్యి రోజుల పోరాటం ద్వారా అమరావతి రైతులు సాధించింది ఏమిటని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అమరావతి ఉద్యమంలో పాల్గొంటున్న వాళ్లలో చాలామంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఉన్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. అమరావతి ఉద్యమంలో పాల్గొన్న వాళ్లు సాధించింది కూడా ఏదీ లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. అయితే అమరావతి కోసం భూములిచ్చిన పేదలకు న్యాయం చేయాలని చాలామంది కోరుకుంటున్నారు.

అమరావతి ఉద్యమం వెనుక టీడీపీ నేతలు ఉన్నారని కూడా ఆరోపణలు ఉన్నాయి. ఏపీలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ మూడు రాజధానులలో అమరావతిని కూడా ఒక రాజధానిగా ప్రకటించిందనే సంగతి తెలిసిందే. అమరావతిని రాజధానిగా ప్రకటించినా ప్రభుత్వం అమరావతిని అభివృద్ధి చేయదనే ఆలోచనతోనే రైతులు పోరాటం చేస్తున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. వెయ్యి రోజుల పోరాటంతో అమరావతి రైతులు ఏమీ సాధించలేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.