మంత్రి వర్గ సహచరుల్ని ఉద్దేశించి, పార్టీ శ్రేణుల్ని ఉద్దేశించి వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారట.! ముందస్తు ఎన్నికలకు అవకాశమే లేదని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టతనిచ్చారట. ఇదే విషయాన్ని వైసీపీ నేతలు స్పష్టం చేస్తున్నారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల దిశగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కసరత్తులు చేస్తున్నారనీ, ముందస్తు వైపే ఆయన మొగ్గు చూపుతున్నారనీ, వైసీపీ నుంచే మీడియాకి లీకులు అందాయి. వైసీపీ అనుకూల మీడియా ఈ మేరకు పలు విశ్లేషణలు కూడా చేయడం చూశాం.
దాంతో, ముందస్తు తప్పదన్న భావనకు దాదాపు అంతా వచ్చేశారు. కానీ, అనూహ్యంగా అందరికీ షాకిచ్చారు వైఎస్ జగన్. అసలు ముందస్తు ముచ్చటే లేదని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తేల్చి చెప్పేశారట. ‘ఎన్నికలకు ఏడాది సమయం కూడా పూర్తిగా లేదు.. అప్రమత్తంగా వుండాలి.. సోసల్ మీడియాని మరింత మెరుగ్గా వాడుకోవాలి’ అని వైసీపీ అధినేత వైఎస్ జగన్, వైసీపీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు తాజాగా.
‘పని తీరు మెరుగుపరచుకోవాల్సినవారికి తక్కువ మయం వుంది. పని తీరు మెరుగ్గా వున్నవాళ్ళు ఇంకా మెరగైన పని తీరు ప్రదర్శించాలి..’ అని మంత్రులకు వైఎస్ జగన్ తేల్చి చెప్పారట. అంతే కాదు, విపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాన్ని ఖండించాలనీ ప్రజలతో మమరింతగా మమేకం అవ్వాలనీ వైఎస్ జగన్ ఆదేశించారట.
మొత్తమ్మీద, ముందస్తు ఊహాగానాలకు మరోమారు తెరపడిందన్నమాట.!