‘ఎన్టీఆర్’ బయోపిక్ లాగే ‘యాత్ర’కూడా…!?

వైఎస్‌ఆర్ జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘యాత్ర’. వైఎస్‌ఆర్‌ పాత్రలో మలయాళ స్టార్‌ మమ్ముట్టి నటించారు. ‘ఆనందో బ్రహ్మ’ ఫేమ్‌ మహి వి. రాఘవ్‌ దర్శకత్వం వహించారు. శివ మేక సమర్పణలో విజయ్‌ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మించిన ఈ సినిమా ఫిబ్రవరి 8న విడుదల కానుంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం ఎలా ఉండబోతోంది. హిట్ అవుతుందా వంటి సందేహాలు సినిమా జనాల్లోనే కాక,సాధారణ ప్రేక్షకుడులో కూడా మొదలయ్యాయి.

అందుకు కారణం…ఎంతో హైప్ తో రిలీజైన ఎన్టీఆర్ ..కథా నాయకుడు చిత్రం బోల్తా కొట్టడమే. దాంతో ఎంతో క్రేజ్ ఉంటుందనుకున్న సినిమాకే దెబ్బ పడింది…మరి వైయస్సార్ పై సినిమా అంటే జనం ఎలా రిసీవ్ చేసుకుంటారు..ఆయన అభిమానులు కానివారు ఎలా స్పందిస్తారు. వాళ్ళు సినిమా ని చూస్తారా అనేది క్వచ్చిన్ గా మారింది. దానికి తోడు దర్శకుడు ‘యాత్ర’ పక్కా పొలిటికల్‌ మూవీ అని, తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఉంటుందనే ప్రచారాన్ని కొట్టిపారేసారు.

వైఎస్‌ గొప్పతనం చెప్పడానికి ఇంకొకర్ని మనం చిన్నగా చేయాల్సిన అవసరం లేదు. ఒకర్ని తిట్టాల్సిన లేదా చెడు చేయాల్సిన అవసరం కూడా లేదు. వైఎస్‌ కి ఉన్న పాజిటివ్‌ థ్రెడ్స్‌ని మనం కరెక్ట్‌గా చూపించగలిగితే చాలు అనుకున్నాం. మన దేవుణ్ని మహానుభావుడు అనుకోవడానికి వేరొకర్ని చిన్నగా చేయాల్సిన అవసరం రాలేదు. పైగా అలాంటి లక్షణం వైఎస్‌గారిది కాదు…అలాగే సినిమాలో వివాదాస్పద అంశాలు కూడా ఏమీ లేవని తేల్చి చెప్పారు. అంతేకాదు చంద్రబాబు నాయుడు పాత్ర తెరపై కనిపించదని తేల్చి చెప్పారు. జగన్ కూడా చివర్లో వచ్చే ఫుటేజ్ లో కనపడతారు కానీ ..అంతకు మించి ఉండరన్నారు.

ఇక సినిమాలో ఎలాంటి కొత్త విషయాలు, వివాదాలు లేకుండా ఉంటే.. సినిమా లో ఇంట్రస్ట్ ఉండదని కథానాయకుడు నిరూపించింది. ఇక యాత్ర సినిమా కూడా.. మొత్తం వైఎస్సార్ పాదయాత్ర నే పూర్తిగా చూపబోతోందని, చిన్న వివాదం కూడా ఉండబోదని చెప్పేసారు. అంటే అదీ డాక్యుమెంటరీలాగ ఉండబోతోందా అనే సందేహాలు కలుగుతున్నాయి.

యాత్ర లో రాజశేఖర్ రెడ్డి జీవితం కూడా అందరికి తెరిచిన పుస్తకాన్నే కొత్తగా ఎలా చూపిస్తారో అనే క్యూరియాసిటీ పెద్దగా ప్రేక్షకుల్లోకి కనబడ్డం లేదు. అందుకే యాత్ర సినిమా మీద ప్రేక్షకుల్లో ఇప్పటివరకూ పెద్దగా క్యూరియాసిటీ కలగడం లేదు.