కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ పై సంచలన నిర్ణయం తీసుకుంది. పార్లమెంట్ ని కూల్చేస్తున్నట్లు ప్రకటించింది. దీనిలో భాగంగా కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ప్రస్తుత పార్లమెంట్ 100 ఏళ్ల క్రితం నాటి పురాతన భవనం అని, భద్రతాపరంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ప్రస్తుత అవసరాలకు కూడా పార్లమెంట్ సరిపోవడం లేదని అఫిడవిట్ లో పేర్కొంది. అగ్నిప్రమాదాలు లాంటివి చోటు చేసుకుంటే కష్టమని, ఈ భవవనాన్ని కూల్చేసి ఇదే స్థలంలో కొత్త భవనం ఏర్పాటు చేస్తామని కేంద్రం తెలిపింది. దీంతో 100 ఏళ్ల చరిత్ర కలిగిన పార్లమెంట్ చరిత్ర ఇప్పుడు మట్టిలో కలిసిపోనుంది.
1921 లో దీని నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. 1937 లో పూర్తి చేసారు. ఇప్పటివరకూ ఇందులో చాలా సమావేశాలు జరిగాయి. ఎన్నో ప్రభుత్వాలు సమావేశాలు నిర్వహించాయి. తాజాగా 2020తో పార్లమెంట్ మట్టిలో కలిసి పోవడానికి సిద్దమవు తోంది. మరి జాతీయ కాంగ్రెస్ పార్టీ సహా ఇతర పార్టీలు కేంద్రం నిర్ణయాన్ని స్వాగతిస్తాయా? వ్యతిరేకిస్తాయా? అన్నది చూడాలి. పార్లమెంటు భవనాన్ని బ్రిటిష్ ఆర్కిటెక్ట్ “హెర్బర్ట్ బేకర్” 1912-13 లో డిజైన్ చేశాడు. దీని పైకప్పుకు 257 గ్రానైట్ స్తంభాలు సపోర్టుగా నిలబెట్టారు. ఈ భవనం ఢిల్లీ జనపథ్ రోడ్డులో, రాష్ట్రపతి భవన్‌కు సమీపంలో ఉంది.
ఇటీవలే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో హైదరాబాద్ లో నెలకొన్న సచివాలయాన్ని కూల్చేయడానికి హైకోర్టు ఆదేశాలిచ్చిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కూల్చివేత పనులు ప్రారంభించిన సంగతి తెలిసిందే. ముందు కుదరదని చెప్పిన హైకోర్టు తర్వాత నిర్ణయం మార్చుకుని కూల్చివేతకు ఆదేశాలిచ్చింది. దీంతో తెలంగాణ యంత్రాంగం కూల్చే పనిలో నిమగ్నమైంది. అదే స్థలంలో కొత్త సచివాలయ నిర్మాణం ప్రభుత్వం చేపట్టనుంది. అందుకోసం 500 కోట్ల బడ్జెట్ కేటాయించారు.