రిటైర్ అయ్యేలోగా ఇవన్నీ చేసేయాలి : ఇదే నిమ్మగడ్డ బిగ్ ప్లాన్ ?

Nimmagadda Ramesh Kumar to do more in Andhra Pradesh
రాజ్యాంగబద్దమైన పదవిలో ఉన్న వ్యక్తిని ఎన్ని అధికారాలు ఉంటాయో ప్రూవ్ చేశారు నిమ్మగడ్డ రమేష్ కుమార్.  ఇన్నాళ్లు ఎన్నికల కమీషనర్ అంటే ఏదో ఎన్నికలు పెట్టుకుని వెళ్ళిపోతారు, రాష్ట్ర ప్రభుత్వానికి తలలో నాలుకలా వ్యవహరిస్తారనే అభిప్రాయం ఉండేది.  చాలా మందికి అసలు ఎన్నికల కమీషనర్ అంటే ఎవరు, ఆయన పవర్స్ ఎలా ఉంటాయి అనేది కూడ తెలియదు.  అసలు నిమ్మగడ్డ ముందు రాష్ట్రానికి ఈసీగా పనిచేసిన అధికారుల పేర్లు కూడ చాలామందికి తెలియదు.  అలాంటిది నిమ్మగడ్డ రమేష్ కుమార్ మాత్రం జగన్ సర్కారును ఢీకొట్టి ఈసీ తలచుకుంటే ప్రభుత్వాన్నైనా ఊపిరాడకుండా చేయగలరని  నిరూపించారు.  రాజ్యాంగ వ్యవస్థలకు లోబడే ఎవరైనా నడుచుకోవాలని తెలియజెప్పారు.  
 
Nimmagadda Ramesh Kumar to do more in Andhra Pradesh
Nimmagadda Ramesh Kumar to do more in Andhra Pradesh
ఈ నాలుగు విడతల పంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా  నిర్వహించాలని  అనుకుంటున్నారు ఆయన.  ఇదివరకటిలా ఎక్కడా అవినీతి, అక్రమాలను తావులేకుండా ఎలక్షన్ జరపాలని, ఈసీ గట్టిగా ఉంటే ఎన్నికలు ఎంత పారదర్శకంగా జరుగుతాయో చూపించాలని దృఢ నిశ్చయంతో ఉన్నారు.  అధికార పార్టీ ఎక్కడైనా దొరికితే తొక్కెయ్యాలనే కసితో ఉన్నారు.  ఇది మాత్రమే కాదు పంచాయతీ ఎన్నికలు ముగిసిన వెంటనే మున్సిపల్ ఎన్నికలను  జరపాలనే ఆలోచన కూడ ఆయనలో ఉందట.  మార్చి నెలతో ఆయన పదవీ కాలం ముగుస్తుంది.  ఈ పంచాయతీ ఎన్నికలు ఫిబ్రవరి 9న మొదలై 21 వరకు జరుగుతాయి.  అవి ముగిసిన వెంటనే కార్పొరేషన్ ఎన్నికల నగారా మోగించాలని భావిస్తున్నారట. 
 
స్థానిక ఎన్నికలను పర్యవేక్షిస్తూనే మిగిలిన ఎన్నికలకు సంబంధిచిన షెడ్యూల్ ఖరారు చేయడంలో నిమ్మగడ్డ బిజీగా ఉన్నారని టాక్.  ఏపీలో 75 మునిసిపాలిటీలు ఉన్నాయి, అలాగే 16 కార్పోరేషన్లు, 31 నగర పంచాయతీలు ఉన్నాయి. వీటికి కూడ మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించడానికి ఎన్నికల సంఘం ప్రణాళికను రెడీ చేస్తోందని చెబుతున్నారు.  అవి పూర్తైన వెంటనే ఎంపీటీసీ, జెడ్పిటీసి ఎన్నికలు కూడ పెట్టిన పెట్టవచ్చట.  ఈ ఎన్నికలన్నీ మార్చి 2 లేదా 3వ వారానికి పూర్తయ్యేలా చేస్తున్నారట.  మొత్తానికి నిమ్మగడ్డ వ్యవహారం చూడబోతే రిటైర్ అయ్యేలోపు ఎన్ని చేయాలో అన్నీ చేసేసి వెళ్ళేలని బలంగా నిర్ణయించుకున్నట్టు కనిపిస్తున్నారు.