జగన్ కు కొత్త కష్టాలు.. గృహ సారథుల విషయంలో తప్పటడుగులు పడ్డాయా?

247104-jagan3

ఏపీ సీఎం వైఎస్ జగన్ 2024 ఎన్నికల్లో పార్టీ కచ్చితంగా అధికారంలోకి రావాలని భావిస్తుండగా ఆయనకు కొత్త కష్టాలు ఎదురవుతున్నాయని సమాచారం అందుతోంది. గృహ సారథుల విషయంలో తప్పటడుగులు పడుతున్నాయని కామెంట్లు వినిపిస్తున్నాయి. గృహ సారథులకు వేతనాలు చెల్లించలేమని వైసీపీ సర్కార్ చెప్పినట్టు బోగట్టా. ప్రతి 50 ఇళ్లకు ఇద్దరు చొప్పున గృహ సారథులను నియమించాలని జగన్ సర్కార్ భావిస్తున్నట్టు సమాచారం.

గృహ సారథులుగా పని చేసి టీడీపీ అధికారంలోకి వస్తే ఇబ్బందులు తప్పవని మరి కొందరు ఫీలవుతున్నట్టు తెలుస్తోంది. జగన్ సర్కార్ గృహ సారథుల విషయంలో తప్పటడుగులు వేశారని సమాచారం అందుతోంది. జగన్ సర్కార్ గృహ సారథుల విషయంలో ఏ విధంగా ముందుకెళతారో చూడాల్సి ఉంది. గృహ సారథుల విషయంలో ఇతర పార్టీలు ఏ విధంగా ముందుకెళతాయో తెలియాల్సి ఉంది.

జగన్ సర్కార్ కు రాబోయే రోజుల్లో కూడా ఇబ్బందులు తప్పవు. జగన్ సర్కార్ తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని వెంటనే అమలు చేస్తోంది. ఆ నిర్ణయాల వల్ల ప్రభుత్వానికి కలిగే లాభ నష్టాల గురించి మాత్రం ఆలోచించడం లేదు. ఇప్పటికే ప్రభుత్వానికి ఊహించని స్థాయిలో మొట్టికాయలు పడుతున్నాయని తెలుస్తోంది. సలహాదారులు జగన్ సర్కార్ కు ఏ మాత్రం సాయపడటం లేదని తెలుస్తోంది.

గృహ సారథుల నియామకం పార్టీకి ప్లస్ అవుతుందో లేదో చూడాల్సి ఉంది. గృహ సారథులు పలు చోట్ల జాయిన్ అయ్యి మానేస్తున్నారు. ఇలా జరగడంతో జగన్ సర్కార్ సైతం ఫీలవుతోందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.