తెరపైకి కొత్త రాజకీయం… కాంగ్రెస్ + టీడీపీ + జనసేన!

ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉన్నప్పటికీ ఇప్పటికే ఏపీలో ఎన్నికల వాతావరణం తెరపైకి వచ్చేసింది. ఇందులో భాగంగా మరి ముఖ్యంగా పొత్తులు, ఎత్తులపై టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పటికే ప్లాన్స్ రెడీ చేసుకుంటున్నారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ, జనసేనలతో కలిసి నడవాలని భావిస్తున్నారని తెలుస్తుంది. ఈ పొత్తుపై పవన్ తో పాటు బీజేపీలో ఉన్న బాబు బ్యాచ్.. ఇప్పటికే ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారని తెలుస్తుంది. కాకపోతే బీజేపీ.. అందుకు అంగీకరించడం లేదని అంటున్నారు!

దీంతో కర్ణాటక ఎన్నికల ఫలితాలు విడుదలయిన నేపథ్యంలో… దేశవ్యాప్తంగా, మరి ముఖ్యంగా సౌత్ ఇండియాలో కాంగ్రెస్ రోజు రోజుకీ బలపడుతుందని బాబు నమ్ముతున్నారంట. దానికంటే మరి ముఖ్యంగా… బీజేపీ బలహీనపడుతుందని బలంగా భావిస్తున్నారంట. కాబట్టి… ఈ విషయంలో అస్తమిస్తున్న బీజేపీ కంటే.. తిరిగి ఉదయిస్తున్నట్లు కనిపిస్తున్న కాంగ్రెస్ తో కలిసి ముందుకు వెళ్తే బెటరని చంద్రబాబు భావిస్తున్నారనే చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తుంది.

రాబోయే ఎన్నికల్లో గెలుపు టీడీపీకి అతిముఖ్యం. 2024 ఎన్నికల్లో గెలవని పక్షంలో టీడీపీ మనుగడ సైతం ప్రశ్నార్ధకంగా మారినా ఆశ్చర్యం లేదని.. వయసురీత్యా బాబుకు కుండా ఇంక అంత ఓపిక ఉండకపోవచ్చనే అంటున్నారు విశ్లేషకులు. దీంతో రాబోయే ఎన్నికల్లో గెలుపు మస్ట్ అండ్ షుడ్ కాబట్టి… అన్ని వర్గాల ఓట్లనూ పరిగణలోకి తీసుకోవాలని బాబు భావిస్తున్నారంట.

టీడీపీకి ఏపీలో కమ్మ సామాజికవర్గ ఓట్లు సాలిడ్ గా పడతాయని.. ఇక పవన్ రూపంలో కాపుల ఓట్లు కూడా బలంగానే పడొచ్చని బాబు నమ్ముతున్నారు! ఇక బీసీల్లో ఒక వర్గం టీడీపీకి ఎప్పుడూ ధన్నుగానే ఉంటుందని బాబు నమ్మకం. కాకపోతే ఎస్సీ, ఎస్టీ, క్రీస్టియన్, ముస్లిం ఓట్ల విషయంలో బాబు బెంగగా ఉన్నారని తెలుస్తుంది. దీంతో… ఇప్పుడు జగన్ కు ఉన్న మెజారిటీ ఎస్సీ, మైనారిటీ ఓటు బ్యాంకు అంతా కాంగ్రెస్ పార్టీనుంచి బదలాయింపయ్యైందని బాబు బలంగా నమ్ముతున్నారు. సో… రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తుపెట్టుకుంటే… ఎస్సీ, క్రీస్టియన్, ముస్లిం ఓటు బ్యాంకు ను కూడా ఎంతోకొంత చీల్చొచ్చని బాబు భావిస్తున్నారని తెలుస్తుంది.

అందులో భాగంగా… బీజేపీతో కలిసి పూర్తిగా ఎస్సీ, ఎస్టీ, క్రీస్టియన్, ముస్లిం ఓట్లను గంపగుత్తగా వదిలేసుకోవడం కంటే… కాంగ్రెస్ ను కలుపుకుని తులమో ఫలమో ఆ వర్గాల నుంచి కూడా ఓట్లు రాబట్టొచ్చని ఆలోచిస్తున్నారంట. అందులో భాగంగా… బీజేపీని సైడ్ చేసి, కాంగ్రెస్ – జనసేనలను కలుపుకుని పోటిచేయాలని బాబు భావిస్తున్నారని తెలుస్తుంది. పైగా… కాంగ్రెస్ తో కలిస్తే కమ్యునిస్టులు కూడా బ్లైండ్ గా మద్దతు పలికే ఛాన్స్ కూడా ఉందనేది మరో ప్లస్ పాయింట్గా ఉందని అంటున్నారు.

మరి బాబు భావిస్తున్న ఈ కొత్త పుత్తు రాజకీయం ఏ మేరకు కార్యరూపం దాల్చుంది… రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ కు ఏపీలో ఎలాంటి ఆదరణ ఉండబోతుంది… కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఏర్పాటుచేసిన టీడీపీ… తిరిగి అదే పార్టీతో పొత్తు పెట్టుకుంటే… ఆ విషయాన్ని ఏపీ జనాలు ఏ మేరకు రిసీవ్ చేసుకుంటారన్నది వేచి చూడాలి!

కాగా… 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తో చంద్రబాబు పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే! అయితే ఈ పొత్తును అనైతిక పొత్తుగా భావించిన తెలంగాణ ప్రజానికం… ఈ పొత్తుకు ఏమాత్రం సహకరించలేదు!