ఉక్కబోత వద్దు… గోదావరిలో కొత్త రాజకీయం!

కర్ణాటక ఎన్నికల ఫలితాల అనంతరం జాతీయ రాజకీయాల్లో పెను మార్పులు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇదే సమయంలో ఏపీలో కూడా ఊహించని రీతిలో కొత్త రాజకీయాలు తెరపైకి వస్తున్నాయి. అందుకు కర్ణాటక ఫలితాలే పూర్తి కారణం కాకపోవచ్చు కానీ… ఆ ఫలితాలు కూడా ఒక కారణం! చంద్రబాబు – పవన్ – బీజేపీ ల పొత్తుల అంశం తెరపైకి వస్తున్న నేపథ్యంలో… ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయని తెలుస్తుంది.

ఎవరు అవునన్నా కాదన్నా… ఎస్సీ, ఎస్టీ, బీసీ, క్రీస్టియన్, ముస్లిం లు అధికంగా ఉన్న ప్రాంతాల్లో బీజేపీకి అంత అనుకూలంగా ఫలితాలు ఉండవు! మిగిలిన రాష్ట్రాల సంగతి కాసేపు పక్కనపెడితే.. ఏపీ లాంటి రాష్ట్రాల్లో.. పైగా గోదావరిజిల్లాలాంటి ప్రాంతాల్లో అది అస్సలు సాధ్యం కాదు! అందుకు టీడీపీ – జనసేనలు కూడా మద్దతు పలికితే అప్పుడు ఏదైనా అద్భుతం జరగొచ్చు. దీంతో… ఈ మూడు పార్టీలు కలిసి వెళ్తారని కథనాలొస్తున్న తరుణంలో… తమ సీట్లకు ఎసరు తగలొచ్చని కోందరు టీడీపీ నేతలు సీరియస్ గా ఆలోచిస్తున్నారంట.

పవన్ పూర్తిగా గోదావరి జిల్లాలపైనే ఆధారపడిపోతున్న పరిస్థితుల్లో… ఆ రెండు ఉమ్మడి జిల్లాలలోనే మెజారిటీ సీట్లు అడిగే చాన్స్ ఉంది. పైగా ఇప్పటికే స్థానిక జనసేన నేతలు సైతం… ఇప్పటి నుంచే వారే అభ్యర్థులుగా బ్యానర్స్ కట్టేసుకుంటున్నారు.. టీడీపీ అభ్యర్థులను గిల్లుతున్నారు. దీంతో… ఈ ఉక్కపోతలో అవసరమా.. ఫ్యాన్ కిందకి చేరిపోతే పోలా అని ఆలోచిస్తున్నారట కొంతమంది టీడీపీ నేతలు. ఈ మేరకు జగన్ సిట్టింగులను సైడ్ చేసే పక్షంలో.. ఆయా స్థానాల్లో తమను జగన్ కచ్చితంగా పరిగణలోకి తీసుకుంటారని వారు నమ్ముతున్నారంట.

అలా అని ప్రస్తుత వైసీపీ నేతలను రెచ్చగొట్టడం, వెక్కిరించడం, గిల్లడం వంటివి చేయకుండా… సైలంట్ గా తెరవెనుక కలుస్తున్నారని, వారిపై విమర్శలు కూడా తగ్గించారని తెలుస్తుంది. మరో రెండు మూడు నెలల్లో ఈ వ్యవహారంపై మరింత క్లారిటీ రావొచ్చని.. ఇది టీడీపీ జనసేనలకు రాబోయే కాలంలో చాలా ఇబ్బందులు సృష్టించబోతుందని అంటున్నారు పరిశీలకులు.