తెలంగాణలో దూకుడు పెంచిన కొత్త జర్నలిస్టు ఫోరం

తెలంగాణలో గత ఆదివారం కొత్తగా పురుడు పోసుకున్న జర్నలిస్టు సంఘం దూకుడు పెంచింది. ‘‘ సేవ్ తెలంగాణ ’’ నినాదంతో ఆవిర్భవించిన ఈ కొత్త జర్నలిస్టు ఫోరం  శుక్రవారం కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్ దామోదర రాజనర్సింహ్మకు వినతిపత్రం సమర్పించింది. తెలంగాణ వచ్చిన తర్వాత జర్నలిస్టుల బతుకులు పెంక మీది నుంచి పొయిలో పడ్డాయని ఆవేదన వ్యక్తం చేసింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జర్నలిస్టులకు, మీడియా రంగంలో పనిచేస్తున్న నాన్ వర్కింగ్ జర్నలిస్టులకు ఏరకమైన చర్యలు చేపట్టాలో వినతిపత్రంలో వివరించింది. 

సేవ్ తెలంగాణ జర్నలిస్టుల ఫోరం దామోదర రాజనర్సింహ్మకు అందజేసిన వినతిపత్రాన్ని కింద యదాతదంగా ప్రచురిస్తున్నాం.  

గౌరవనీయులైన దామోదర రాజనర్సింహా గారు,

చైర్మైన్ మ్యానిఫేస్టోకమిటీ,

టీపిసిసి, హైదరాబాద్

తెలంగాణ కోసమే తెలంగాణ జర్నలిస్టులు అనే నినాదంతో యావత్తు జర్నలిస్టు సమాజం స్వరాష్ట్ర సాధన సమరంలో ప్రత్యక్షంగా పాల్గొన్న సంగతి మీకు తెలిసిందే. తెచ్చుకున్న తెలంగాణలో జర్నలిస్టుల పరిస్థితి  పెంక మీద నుంచి పొయ్యిలో పడ్డ సామెత లాగా మారింది. గతంలో ఎప్పుడు లేని విధంగా ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యలు, అనారోగ్యం కారణంగా తెలంగాణలో 250మంది జర్నలిస్టులు అసువులు బాసిన దుస్దితి గుండెలను పిండేస్తున్న అంశం. దేశంలోనే కొత్త పుంతలు తొక్కుతున్న మీడియా రంగంలో పనిచేస్తున్న జర్నలిస్టులు, నాన్ వర్కింగ్ జర్నలిస్టులు అనేక సమస్యలతో సతమతం అవుతున్నారు. అర్దాకలి, ఆర్థిక ఇబ్బందులు, అవమానాలు, ఉద్యోగ భద్రత లేని బతుకులు ఎల్లదీస్తున్నారు. తెలంగాణలో సరైన గౌరవం దక్కడంలేదు. సమస్యల పరిస్కారం కోసం వెయ్యికళ్లతో నిరిక్షిస్తున్నాము. ఎన్నికల ప్రణాళికలో మా సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్ పార్టీ తరుపున హామీ ఇస్తారని ఆశిస్తున్నాము.

దామోదరకు జర్నలిస్టుల సమస్యలను వివరిస్తున్న జర్నలిస్టు నేత జమాల్ పూర్ గణేష్

1) ప్రింట్, ఎలక్ర్టానిక్, వెబ్ మీడీయాలో పనిచేస్తున్న జర్నలిస్టులందరికి అక్రిడేషన్ కార్డ్ లు ఇవ్వాలి. 

2) చిన్న, మధ్యతరహా పత్రికలల్లో పనిచేస్తున్న జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డ్ లు రాకుండా అవరోధంగా ఉన్న జీవో 239ని రద్దు చేయాలి.

3) స్దానిక పత్రికలకు పదిహేను శాతం ప్రకటనలను విధిగా జారిచేయాలి. ఎన్ ప్యానల్ మెంట్ లో చేర్చకుండా నిరాదరణకు గురౌతున్న 300స్దానిక పత్రికలను గుర్తించి ప్రకటనలు జారిచేయాలి.

4) అక్రిడేషన్ లతో సంబంధం లేకుండా మీడియా రంగంలో పనిచేస్తున్న జర్నలిస్టులందరికి హెల్త్ కార్డ్ లు ఇవ్వాలి. హెల్త్ కార్డుల అమలు తీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు పత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలి.

5) హైదరాబాద్ తో పాటు మండల, డివిజన్, జిల్లా కేంద్రాల్లో పనిచేస్తున్న పార్ట్ టైం విలేకర్లలందరికి ప్రతినెల 5వేల రూపాయల జీవన భృతి ఇచ్చి ఆర్దిక ఇబ్బందుల నుంచి విముక్తి కల్పించాలి.

6) స్దాయి బేధం లేకుండా జర్నలిస్టులందరికి ఇండ్లు కట్టించి ఇవ్వాలి.

7) జిల్లా పౌరసంబంధాల శాఖ కార్యలయాల్లో పత్రిక ప్రకటనలను తర్జుమా చేసేందుకు ఉర్దు ట్రాన్సిలేటర్లను నియమించాలి. 

8) ప్రింట్, ఎలక్ట్టానిక్ మీడియాలో పనిచేస్తున్న నాన్ వర్కింగ్ జర్నలిస్టులు పదివేల మంది వరకు ఉన్నారు. వీరంతా చాలిచాలని వేతనాలతో ఇబ్బంది పడుతున్నారు. వీరిపై ఆధారపడిన కుంటుంబ సభ్యులందరికి ప్రభుత్వమే ఆరోగ్యభద్రతను కల్పిస్తూ విధాన పరమైన నిర్ణయాన్ని తీసుకోవాలి.

9) ఢిల్లీ తరహాలో జర్నలిస్టుల కోసం ఇక్కడ కూడా గౌరవవేతనం యాజమాన్యాల నుండి ఇప్పించేందుకు జీవో జారి చేసి అమలు చేసేలా చర్యలు తీసుకోవాలి.

10) దాడుల నియంత్రన కోసం ఉన్న కమిటీలకు విసృత అధికారాలు ఇచ్చి పత్రికా స్వేఛ్చను కాపాడాలి.

ఇట్లు

కన్వీనర్లు,

1) జమాల్ పూర్ గణేష్, సెల్- 9948166445
2) మధుసూదన్ రావు ముప్పవరం, సెల్ – 9948686445
3) అమిత్ బట్టు, సెల్- 9000444361
4) అమర్.బి, సెల్ – 9000160023

కో-కన్వీనర్లు,
1) నాగరాజు అల్లి
2) వి.శ్రీనివాస్ రెడ్డి
3) విజయ్
4) సంతోష్ నాయక్