జనసేన అంటే వాళ్లు మాత్రమేనా.. పవన్ ముఖ్యమంత్రి కావడం కష్టమేనా?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ, టీడీపీ తర్వాత అంతో ఇంతో గుర్తింపు ఉన్న పార్టీ ఏదనే ప్రశ్నకు జనసేన పేరు సమాధానంగా వినిపిస్తుంది. అయితే 2014 సంవత్సరంలో జనసేన ఏ విధంగా ఉందో 2022 సంవత్సరంలో కూడా జనసేన అదే విధంగా ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి. టీడీపీ, వైసీపీ తరపున టికెట్లు పొందడానికి ఇప్పటికే చాలామంది నేతల మధ్య తీవ్రస్థాయిలో పోటీ నెలకొందనే సంగతి తెలిసిందే.

జనసేన పార్టీకి ద్వితీయ శ్రేణి నాయకులు లేకపోవడం కూడా ఆ పార్టీకి మైనస్ అయింది. ఆ పార్టీ తరపున పోటీ చేయడానికి ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా దొరకని పరిస్థితి నెలకొంది. జనసేన పార్టీకి ఇలాంటి దారుణమైన పరిస్థితి ఉండటంపై ఆ పార్టీ అభిమానులు కూడా చాలా ఫీలవుతున్నారు. జనసేన తరపున పోటీ చేయాలనుకునే వాళ్లకు తమకు నచ్చిన నియోజకవర్గం నుంచి పోటీ చేసే ఛాన్స్ కూడా ఉంది.

రాష్ట్రంలో 2024 ఎన్నికల సమయానికి జనసేన పుంజుకుంటుందని అందరూ భావించగా అందుకు భిన్నంగా పరిస్థితులు నెలకొన్నాయి. నాదెండ్ల మనోహర్ వచ్చే ఎన్నికల్లో తెనాలి నుంచి పోటీ చేస్తానని తాజాగా ప్రకటించారు. అసలు జనసేన అధినేత అభ్యర్థుల ఎంపికపై దృష్టి పెట్టకుండా ఏం చేస్తున్నారని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.

పవన్ కళ్యాణ్ ఇప్పటికైనా జనసేనపై దృష్టి పెట్టని పక్షంలో గత ఎన్నికల్లో ఎదురైన ఫలితాలే ఈ ఎన్నికల్లో కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టీడీపీతో పొత్తు పెట్టుకోవాలనే ఆలోచనతోనే అభ్యర్థుల ఎంపిక విషయంలో పెద్దగా దృష్టి పెట్టడం లేదని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు. జనసేన ఏపీలో పుంజుకుంటుందో లేదో చూడాల్సి ఉంది. పవన్ ఇంత నిర్లక్ష్యంగా ఉంటే ఆయన ముఖ్యమంత్రి కావడం అసాధ్యమని కామెంట్లు వినిపిస్తున్నాయి.