బాబూ… పక్కకెళ్లి ఆడుకోమ్మా!

ఏపీలో జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత.. దృష్టంతా సంక్షేమంపైనే పెట్టారని, అభివృద్ధి వైపు ఆలోచనలు లేవని, పరిశ్రమలను తెచ్చే పనులు చేయడం లేదని, యువతకు ఉద్యోగాల కల్పనలో వెనకబడిపోయారని కామెంట్లు వినిపించేవి. పెట్టుబడులు పెట్టడానికి బడా బడా కంపెనీలు రావడం లేదని.. అలా రావాలంటే ప్రభుత్వానికి బోలెడు స్కిల్స్ ఉండాలని చెప్పేవారు. అయితే… తాజాగా ఆ విమర్శకు తనదైన రీతిలో బదులిచ్చారు జగన్!

ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్యా… బుల్లెట్ దిగిందా లేదా అన్నట్లుగా జగన్ కెరీర్ ఉంటుందని కంపేర్ చేస్తున్నారు విశ్లేషకులు! కొత్త ప్రభుత్వం.. ఆ హనీమూన్ పిరియడ్ ముగిసిన అనంతరం కరోనా కష్టకాలం.. మధ్య మధ్యలో కోర్టుల ద్వారా ప్రతిపక్షాల అడ్డంకులు… ఇవన్నీ దాటుకుంటూ ముందుకువెళ్లిన జగన్… ఊహించని స్థాయిలో పెట్టుబడులను సాధించారు!

అవును… విశాఖలో జరుగుతున్న గ్లోబల్ ఇన్వెస్టర్ల సమ్మిట్ లో తొలిరోజు (శుక్రవారం) చారిత్రక సంఘటనలు జరిగాయి. ఈ సందర్భంగా.. తాము ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు కొనసాగిస్తామని అంబానీ చెప్పగా.. కృష్ణపట్నం ఓడరేవులో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కోసం పదివేల కోట్ల పెట్టుబడి పెడతామని జేఎస్‌డబ్ల్యూ గ్రూపు ఎండీ జిందాల్ ప్రకటించారు. ఈ సందర్భంగా ప్రసంగించిన జగన్… విశాఖలో గ్లోబల్ సమ్మిట్ జరపడం గర్వంగా ఉందని.. ఈ సమ్మిట్ ద్వారా 92 అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంటున్నామని తెలిపారు.

ఈ సమ్మిట్ వల్ల రాష్ట్రానికి సుమారు రూ. 13 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని తెలిసి ఆనంద పడుతున్నానని తెలిపిన జగన్… వీటిలో 8.54 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించి తొలిరోజు (శుక్రవారం) అవగాహన ఒప్పందాలు జరగనుండగా.. రెండోరోజు (శనివారం) మిగిలిన ఎంవోయూలు కుదుర్చుకుంటామని తెలిపారు. వీటిద్వారా సుమారు 6 లక్షల మందికి ఉపాది అవకాశాలు రాబోతున్నాయని జగన్ ప్రకటించారు!

దీంతో… మొదటిసారి సీఎం అయినా కూడా.. ఈ స్థాయిలో పెట్టుబడులు తేవడం గొప్ప విషయమని అంటున్నారు ఏపీ జనాలు! 40 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నామని చెప్పుకుంటున్న చంద్రబాబుకు.. ఈ సందర్భంగా సెటైర్లు వేస్తున్నారు జగన్ ఫ్యాన్! ఎప్పుడు వచ్చాము, ఎంతకాలం నుంచి ఉన్నామన్నది కాదన్నాయ్యా – వచ్చాక ఊహకందని పెట్టుబడులు తెచ్చామా లేదా అన్నది ముఖ్యం అంటూ.. బిజినెస్ మ్యాన్ సినిమా టైటిల్ కి జగన్ ఫోటోలు పెట్టి ఆ పోస్టర్లతో సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు నెటిజన్లు! కామెంట్లు పెడుతున్నారు!

ఇదే క్రమంలో… నెల్లూరు టీడీపీ నేత ఆనం రమణారెడ్డి కామెంట్లను కూడా ఈ సందర్భంగా గుర్తుచేస్తున్నారు నేటిజన్లు! టీడీపీ పార్టీ ఆవిర్భవించే సమయానికి జగన్ డైపర్ లు వేసుకుని తిరుగుతున్న పిల్లాడని అన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆమాటలనే జతచేసి… “పిల్లాడు పిల్లాడు అన్నారు కదా – కొడితే 13లక్షల కోట్లు… బాబూ పక్కకెళ్లి ఆడుకోండమ్మా” అంటూ సెటైర్స్ వేస్తున్నారు!