ఒంగోలు ఇచ్చేందుకు వైసిపి రెడీ, నెల్లూరు కోరుతున్న మాగుంట

ప్రకాశం జిల్లా ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి పార్టీకి నేడో రేపో వైఎస్ ఆర్ కాంగ్రెస్ లో చేరుతున్నారు. ఆయన కోసం మంచి ముహూర్తం, బలమయిన ముహూర్తం ఇక ప్రముఖ స్వామీజీలు నియమిస్తున్నారని తెలిసింది.ఇందులో ఒకరు చినజియ్యర్ స్వామీ కాగా, మరొకరు విశాఖ శారదాపీఠం స్వరూపానందేంద్ర స్వామీజీ. వారినుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే ఆయన వైసిపి కండువా కప్పుకుంటనాని ఆయన సన్నిహితులొకరు ‘తెలుగు రాజ్యం’ కు చెప్పారు.

మొత్తానికి ఆయన టిడిపి ని వీడటం, వైసిపిలో చేరడం మీద ఉన్నఅనుమానాలన్నీ తొలగిపోయాయి. అయితే, ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే ది ఇంకా నలుగుతూనే ఉంది. అయితే, అది కూడా దాదాపు ఖరారయినట్లే నని, ఒక అధికారిక ప్రకటన వెలవడటమే మిగిలిందని చెబుతున్నారు. ఆయన పోటీచేసే స్థానం మీద ఇంకా రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతూనే ఉంది. ఆయన నెల్లూరు లోక్ సభ స్థానం నుంచి పోటీచేస్తారా లేక ఒంగోలు నుంచే బరిలోకి దిగుతారా అనేది ఈ చర్చ.

నెల్లూరు లో వైసిపి ఎంపి రాజమోహన్ రెడ్డి మీద కొంత వ్యతిరేకత వచ్చిందని, ఆయన పెద్దగా జనంలోకివెళ్లలేకపోయారని, ఎన్నికలలో ఎంత జగన్ పేరుమీదే పోరాడినా, అభ్యర్థి మీద వచ్చే యాంటి ఇంకంబెన్సీ (వ్యతిరేకత)ను విస్మరించరాదని వైసిపి మొదట్లో భావించింది. దానికి తోడు అక్కడ తెలుగుదేశం పార్టీ ఆదల ప్రభాకర్ రెడ్డి ని రాజమోహన్ రెడ్డి మీద అభ్యర్థిగ నిలబెడతారని వైసిపి అనుమానించింది.

ఆదాల ప్రభాకర్ రెడ్డి జనంలోకి దూసుకుపోయే తత్వం ఉన్నాడు. ఇలాంటి రెడ్డి, పెద్దమనిషిలాగా ఉండే రాజమోహన్ రెడ్డి మీద పోటీకి వస్తే గెలుపు కష్టమవుతుందని భావించి ఆయనను ఒంగోలుకు మార్చాలని అనుకున్నారు.

అయితే, ఇపుడు ఆదల ప్రభాకర్ రెడ్డిని నెల్లూరు ఎంపిగా టిడిపి పోటీకి దించడం లేదు. ఎందుకంటే, ఆయనను నెల్లూరు రూరల్ అభ్యర్థిగా ఎంపిక చేశారు. అక్కడ వైసిపికి చాలా బలమయిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అభ్యర్థిగా ఉన్నాడు. అందువల్ల ఎంపి గెలవాలంటే కీలమయిన రూరల్ నియోజకవర్గంలో వైసిపిని దెబ్బతీయాలి. అందువల్ల ఆదాలను నెల్లూరు రూరల్ కు పంపించి, నెల్లూరు లోక్ సభలో ఒక బిసి లీడర్ ను నిలబెట్టి ఒక ప్రయోగం చేయాలని టిడిపి భావిస్తూ ఉంది. ఆదాల నెల్లూరు లోక్ సభకు పోటీ చేయడం లేదని తెలిశాక, రాజమోహన్ రెడ్డినే అక్కడ కొనసాగించే అవకాశం ఉందని పార్టీ సీనియర్ నాయకుడొకరు చెప్పారు.

దీని వల్ల మాగుంట శ్రీనివాసులు రెడ్డి ని ఒకపుడు ఆయన ప్రాతినిధ్యం వహించిన ఒంగోలు నియోజకవర్గం నుంచే లోక్ సభకు పోటీచేయించే అవకాశాలున్నాయి. ఆయన జగన్ నుంచి ఈ మేరకు ఆఫర్ వెళ్లిందని కూడా తెలిసింది. ఒంగోలు నియోజకవర్గంలో రెడ్ల ఆదిపత్యం ఉన్న ప్రాంతాలు ఎక్కువగా ఉన్నందున , మాగుంట గెలుపు సునాయాసం అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే, మాగుంటకు ఒంగోలు సీటు మీద అంత ఇష్టం లేదు. ఆయన నెల్లూరు ఇష్టపడుతున్నారు.

అయితే, ఈనెల అయిదో తేదీన ఒంగోలు లోని బృందావన్ గార్డెన్స్ లో ఆయన జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కలవడం జరిగింది. అపుడు ఆయన జనసేనే వైపు కదలుతారని, నెల్లూరు లోక్ సభ సీటుకోసమే ఈ కలయిన అని వార్తలొచ్చాయి. అయితే, ఇది రాజకీయాలింగనం కాదని, మాగుంట కుటుంబానికి పవన్ కుటుంబానికి ఎంతో కాలంగా సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, అందుకే ఆయనను మర్యాదపూర్వకంగా మాగంట కలియడం జరిగిందని చెప్పుకున్నారు. 

గతంలో ఒకసారి ఒంగోలు ఎంపిగా గెలుపొందినా, 2014 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. తర్వాత ఆయనకు ఎమ్మెల్సీ ఆఫర్ చేసి చంద్రబాబు నాయుడు టిడిపిలోకి తీసుకున్నారు. అయితే, ఆసమయంలో తనను మంత్రివర్గంలోకి తీసుకుంటానని హామీ ఇచ్చారని, దానిని అమలుచేయలేదన్నది మాగుంట అసంతృప్తి.
మాగుంటకు తానే ఇచ్చిన హామీని నెరవేర్చకపోవటంపై మాట వరసకు కూడా చంద్రబాబు ఒక్క సారి కూడా ప్రస్తావించక పోవడం మాగుంటను బాధించిందని చెబుతారు. ఇలాంటపుడు జగన్ నుంచి ఆయనకు ఆఫర్ వచ్చిందని, 2019 ఎన్నికల్లో ఒంగోలు ఎంపీ టికెట్ ను ఇచ్చేందుకు జగన్ అంగీకరించారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మాగుంట వంటి నాయకుడు వస్తున్నందున ప్రస్తుత ఎంపి వైవీ సుబ్బారెడ్డిని అసెంబ్లీకి నిలబెట్టాలని కూడా జగన్ నిర్ణయించారని చెబుతారు.

మాగంట ఒంగోలు నుంచి పోటీచేస్తారా లేక ఆయన ఇష్టపడుతున్నట్లు నెల్లూరు కు పంపిస్తారా నేడో రేపో తేలుతుంది.