నెల్లూరు జిల్లా రాజకీయాల గురించి ప్రస్తావిస్తే ఆదాల ప్రభాకర్ రెడ్డి గురించి తప్పకుండా మాట్లాడుకోవాలి. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఏనాడూ జిల్లా రాజకీయాల మీద పట్టు కోల్పోలేదు ఆయన. అధికారం లేనప్పుడు కూడ ఆయన హవా నడిచింది. అలాంటిది ఇప్పుడు పదవిలో ఉన్నా, పార్టీ అధికారం ఉన్నా కూడ జిల్లాలో ఆయన మాట చెల్లుబాటు కావట్లేదట. అందుకు కారణం జిల్లాలో యువనేతలు చేస్తున్న రాజకీయాలేనని అంటున్నారు కొందరు. ఆదాల గత ఎన్నికలకు ముందు టీడీపీని వీడి వైసీపీలో చేరి పార్లమెంట్ టికెట్ మీద గెలుపొందారు. చంద్రబాబు అసెంబ్లీ టికెట్ ఇస్తానన్నా వద్దని వైసీపీకి జైకొట్టారు.
జగన్ సైతం ఆదాల పార్టీలోకి రావడంతోనే ఎంపీ టికెట్ ఇచ్చారు. మేకపాటి కుటుంబాన్ని పక్కనపెట్టి మరీ జగన్ ఆదాలకు ప్రాముఖ్యత ఇచ్చారు. కానీ ఇప్పుడు చూస్తే పరిస్థితి తలకిందులైందట. పేరుకు ఎంపీ అయినప్పటికీ ఆయన మాటేదీ జిల్లా రాజకీయాల్లో నడవట్లేదట. జిల్లా వైసిపీకి పెద్దలుగా ఉనన్ మేకపాటి, వేమిరెడ్డి కుటుంబాల హవానే నడుస్తోందని, పార్టీకి సంబంధించిన ఏ వ్యవహారమైనా ఆ రెండు కుంటుంబాలే చూసుకుంటున్నాయట. పదవులైన, కాంట్రాక్టులైనా వారి కనుసన్నల్లోనే నడుస్తున్నాయట.
ఇక జిల్లాకు చెందిన యువ మంత్రి సైతం ఆదాయాలను పెద్దగా పట్టించుకోకపోవడం, ఒక కోటరీగా ఏర్పడి వన్ సైడ్ పాలిటిక్స్ నడుపుతున్నారట. అందుకే ఆధార్ కొన్నాళ్లుగా జిల్లా వైపే చూడటంలేదని, హైదరాబాద్లోని నివాసానికి పరిమితమై తన పని ఏమిటో చూసుకుని సైలెంట్ అయిపోతున్నారని టాక్. పరిస్థితి ఇలాగే ఉంటే పంచాయితీ జగన్ వరకు వెళ్ళవచ్చట. ఇప్పటికే సీనియర్ నేత ఆనం రామనారాయణరెడ్డి సైతం జిల్లా రాజకీయాల్లో తనకు ప్రాధాన్యం ఇవ్వకపోవడం మీద జగన్ వద్ద పిర్యాదు చేయడం, ఆయన సర్దిచెప్పడం జరిగాయి. ఇప్పుడు మరొక బిగ్ లీడర్ ఆధార్ కూడా అసంతృప్తిలోకి వెళ్లడం కొసమెరుపు.