మాచర్ల ప్రభుత్వాసుపత్రిలో డాక్టర్ల నిర్లక్ష్యం.. బొడ్డుతాడు బదులు చిన్నారి ఆ భాగం కోసిన సిబ్బంది?

ఆస్పత్రులలో ప్రాణాలు పోయాల్సిన డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. వైద్యం చేసే సమయంలో డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా ఇటీవల అప్పుడే పుట్టిన చిన్నారి చిటికెన వేలుని కోల్పోయిన ఘటన పల్నాడు జిల్లాలోని మాచర్ల ప్రభుత్వాసుపత్రిలో చోటుచేసుకుంది.

వివరాలలోకి వెళితే… స్వరూప అనే గర్భవతి ప్రసవం కోసం మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రిలో గత నెల 30వ తారీఖున అడ్మిట్ అయింది. స్వరూపకి కాన్పు చేసిన డాక్టర్లు ఆమె స్పృహలోకి రాకముందే పిల్లాడి బొడ్డుతాడు కోయటానికి బదులు చిన్నారి చిటికెన వేలు కోశారు.దీంతో వెంటనే చిన్నారిని గుంటూరు జి జి హెచ్ ఆసుపత్రికి తరలించారు.

అక్కడ చిన్నారిని పరీక్షించిన వైద్యులు మెరుగైన నిమిత్తం కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.బాబు వేలు చివర్లోతెగిందని, శస్త్రచికిత్స చేసి అతికిస్తామని అక్కడి వైద్యులు హామీ ఇచ్చారు. కానీ ఈ విషయం బయటికి పోకుండా ఆస్పత్రి సిబ్బంది జాగ్రత్త పడిన కూడా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కాన్పు చేసే సమయంలో వైద్యులకి బదులు పారిశుద్ధ్య కార్మికురాలు బొడ్డుతాడు కోయటానికి బదులు చిన్నారి చిటికెన వేలు కోసింది దీంతో ఆమెను విధుల నుండి తొలగించినట్లు ఆసుపత్రి యాజమాన్యం వెల్లడించారు.అయితే విషయం తెలిసిన కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున వైద్య సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.