Pawan Kalyan: సినీ నటుడు పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకున్న విషయం తెలిసిందే. ఇలా డిప్యూటీ సీఎం గా కొనసాగుతున్న ఈయన పిఠాపురం నియోజకవర్గానికి మాత్రం వరాల జల్లులు కురిపిస్తున్నారు. పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలుపొందిన పవన్ కళ్యాణ్ అక్కడ ప్రజలకు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నింటిని నెరవేర్చడమే కాకుండా పిఠాపురం నియోజకవర్గానికి ఊహించని అభివృద్ధిని కూడా చేస్తున్నారని చెప్పాలి.
ఇప్పటికే పవన్ కళ్యాణ్ పిఠాపురంలో తన సొంత ఇంటి కోసం పార్టీ ఆఫీస్ కోసం స్థలం కొనుగోలు చేయడంతో అక్కడ ఒక్కసారిగా భూమి ధరలకు రెక్కలు వచ్చాయి. దీంతో అక్కడున్నటువంటి రైతులందరూ కూడా ఎంతగానో లబ్ధి పొందుతున్నారని చెప్పాలి. ఇకపోతే తాజాగా పిఠాపురం ప్రజలకు పవన్ కళ్యాణ్ మరొక శుభవార్తను తెలిపారు.పిఠాపురం నియోజకవర్గంలో ఏకంగా వంద పడకల ఆసుపత్రి నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
30 బెడ్ల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను 100 పడకల ఆస్పత్రికి అప్గ్రేడ్ చేయబోతున్నట్లు వెల్లడించారు. దీని కోసం ఏకంగా 38 కోట్ల రూపాయలను మంజూరు చేసినట్లు జనసేన తన అధికారిక సోషల్ మీడియా కాదా ద్వారా తెలియజేశారు. ఇక ఈ ఆస్పత్రి కోసం అవసరమైనటువంటి 66 వైద్యశాఖకు సంబంధించిన పోస్టులను కూడా త్వరలోనే భర్తీ చేయబోతున్నారని ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా త్వరలోనే విడుదల చేయనున్నారు.
ఇలా కొత్తగా ఏర్పాటు చేయబోయే ఉద్యోగస్తుల కోసం కూడా ప్రతి ఏడాది వేతనాల కోసం రూ.4.32 కోట్లు వెచ్చించినట్టు జనసేన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. దీంతో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఒకసారి ఏదైనా చెప్పారంటే తప్పనిసరిగా చేస్తారని పవన్ మార్క్ ఏంటో స్పష్టంగా కనబడుతోంది అంటూ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.