ఇడుపులపాయ నుంచి హైవే.. ఇంతకంటే బెస్ట్ జోక్ ఉండదేమో పవన్?

ఇప్పటం గ్రామంలో రహదారి విస్తరణ పనుల దిశగా జగన్ సర్కార్ అడుగులు వేయడం పవన్ కళ్యాణ్ కు ఆగ్రహం కలిగించింది. ఇక్కడ ఇళ్లను కూల్చారని ఇలా చేయడం కిరాతకం అని పవన్ కామెంట్లు చేశారు. పోలీసులు రాజ్యాంగాన్ని పరిరక్షించాలని అందరికీ అండగా ఉంటానని అరెస్ట్ చేసినా భయపడనని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. జనసేన సభలకు స్థలం ఇచ్చారనే కారణం వల్లే ఇళ్లను కూల్చారని పవన్ పేర్కొన్నారు.

ఇడుపులపాయ నుంచి హైవే వేస్తానని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. పవన్ బహుశా తన జీవిత కాలంలో ఇడుపులపాయ చూసి ఉండరని అందుకే ఇలాంటి కామెంట్లు చేస్తున్నారని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. వేంపల్లి నుంచి ఇడుపులపాయకు డబుల్ రోడ్డు ఉంది. రోడ్డుకు ఇరువైపులా కొండలు ఉన్నాయి. ఇడుపులపాయ చిన్న గ్రామం కాగా మెయిన్ రోడ్డుకు ఉన్న ఇళ్ల సంఖ్య కూడా చాలా అంటే చాలా తక్కువ.

ఇతర ప్రధాన పట్టణాలను కలుపుతూ ఇడుపులపాయ నుంచి రోడ్డు విస్తరణ చేసే అవకాశం లేదు. ఒకవేళ అలా చేయాలన్నా సాధారణంగా రోడ్డు విస్తరణ కోసం చేసే ఖర్చుతో పోల్చి చూస్తే ఇక్కడ రోడ్డు వెయ్యాలంటే 4 నుంచి 5 రెట్లు ఎక్కువ మొత్తం ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ విషయాలేవీ తెలియకుండానే పవన్ సులువుగా ఇడుపులపాయ నుంచి హైవే అంటూ కామెంట్లు చేయడం గమనార్హం.

పవన్ కళ్యాణ్ ఇష్టానుసారం మాట్లాడతారని ఈ కామెంట్లతో మరోసారి ప్రూవ్ అయిందని మరి కొందరు కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్లు వైరల్ అవుతున్నాయి. పవన్ కళ్యాణ్ తెలివితేటలు ఈ విధంగా ఉన్నాయని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.