పవన్ పై విమర్శలు.. పొత్తు పెట్టుకున్నా టార్చర్ మామూలుగా ఉండదుగా?

pawan-kalyan-posts-a-cryptic-message-on-twitter-001

చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మళ్లీ కలవడంతో టీడీపీ జనసేన పొత్తు ఉండబోతుందని కొంతమంది సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్లు తెగ వైరల్ అవుతున్నాయి. పవన్ కళ్యాణ్ టీడీపీతో పొత్తు పెట్టుకున్నా ఆ టార్చర్ అయితే మామూలుగా ఉండదని తెలుస్తోంది. కాపుల ఓట్లను పవన్ కమ్మోళ్లకు అమ్మేస్తున్నారంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. 30 స్థానాలలో జనసేన పోటీ చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.

పవన్ కళ్యాణ్ పొత్తు దిశగా అడుగులు వేస్తే మాత్రం పవన్ శ్రేయోభిలాషులు, వైసీపీ నేతలు చుక్కలు చూపించడం ఖాయమని కొంతమంది చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ ను చంద్రబాబు కరివేపాకులా వాడుకుంటున్నాడని ఈ విషయం ఆయనకు అర్థం కావడం లేదని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. పవన్ అభిమానులు సైతం పవన్ పై వ్యక్తమవుతున్న విమర్శల విషయంలో సీరియస్ గా ఉన్నారు.

టీడీపీ జనసేన పొత్తు పెట్టుకున్నా పెట్టుకోకపోయినా రాష్ట్ర రాజకీయాల్లో కీలక మార్పులు చోటు చేసుకునే అవకాశాలు అయితే ఉంటాయని కొంతమంది కామెంట్లు చేస్తుండటం గమనార్హం. 2024 ఎన్నికల్లో గెలవాలంటే పవన్ ఇప్పటికైనా పోటీ చేసే నియోజకవర్గాన్ని ప్రకటించాలని కొంతమంది సూచనలు చేస్తున్నారు. చేసిన తప్పునే పవన్ మళ్లీమళ్లీ ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదని కామెంట్లు వినిపిస్తున్నాయి.

జరుగుతున్న పరిణామాలను పవన్ సైతం గమనించాల్సి ఉంది. సొంతంగా పవన్ కళ్యాణ్ పార్టీని గెలిపించుకోలేరా? అనే ప్రశ్నలకు సమాధానం దొరకాల్సి ఉంది. జనసేనకు టీడీపీ ఎక్కువ స్థానాలు ఇచ్చినా ఆ స్థానాలలో టీడీపీ అభ్యర్థులే పోటీ చేసే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయని సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి.