జీతాల విషయంలో విమర్శలు.. పథకాలపై ఉన్న శ్రద్ధ జీతాలపై లేదా?

CM YS Jagan Mohan Reddy

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగులకు సకాలంలో వేతనాలు అందడం లేదు. వేతనాలు జమ కాకపోవడం గురించి విమర్శలు చేస్తే ప్రభుత్వం తమ విషయంలో కక్షపూరితంగా వ్యవహరించే అవకాశాలు ఉన్నాయని ఉద్యోగాలు భయాందోళనకు గురవుతున్నారు. ఐఏఎస్, ఐపీఎస్ లకు కూడా వేతనాలు జమ కాలేదని సమాచారం అందుతోంది. ఎప్పుడు జీతాలు ఖాతాలలో జమ అవుతాయో కూడా చెప్పే పరిస్థితి లేదని వినిపిస్తుండటం చర్చనీయాంశం అయింది.

జగన్ సర్కార్ కు పథకాలపై ఉన్న శ్రద్ధ జీతాలపై లేదా? అని కొంతమంది కామెంట్లు చేస్తుంటే మరి కొందరు మాత్రం ఇప్పటికే ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్రస్థాయిలో వ్యతిరేకత ఉందని జగన్ సర్కార్ తీరు వల్ల ఆ వ్యతిరేకత అంతకంతకూ పెరుగుతోందని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఉన్నతాధికారులకు కూడా వేతనాలు జమ కాలేదంటే ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతకు ఇదే నిదర్శనమని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు.

ఒకటో రెండో పథకాలను ప్రభుత్వం ఆపేసి జీతాలపై శ్రద్ధ పెడితే బాగుంటుందని మరి కొందరు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. జీతాల విషయంలో వ్యక్తమవుతున్న విమర్శలను దృష్టిలో ఉంచుకుని జగన్ సర్కార్ ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది. ఏపీ సర్కార్ కు కొత్త అప్పులు పుట్టకపోవడం వల్లే ఈ సమస్య ఎదురవుతోందని కూడా కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

ఏపీ ప్రభుత్వం రోజువారీ ఆదాయాలపై ఆధరపడి జీతాలను చెల్లిస్తోందని ప్రచారంలోకి వస్తున్న వార్తల వల్ల ప్రభుత్వం పరువు పోతుంది. ప్రతి నెలా జీతాల విషయంలో ఇదే విధంగా జరిగితే మాత్రం జగన్ సర్కార్ ఉద్యోగుల నమ్మకాన్ని కోల్పోవడం ఖాయమని మరి కొందరు వెల్లడిస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రభుత్వంపై వ్యతిరేకత అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.