వైసీపీ సోషల్ మీడియా వారియర్స్ కు సెల్ ఫోన్.. చెవిలో పూలు భలే పెట్టారుగా?

2024 ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా జగన్ సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సోషల్ మీడియా వారియర్స్ నియామకానికి జగన్ సర్కార్ సిద్ధమైంది. 2024 ఎన్నికలకు సమయం చాలానే ఉన్నా సోషల్ మీడియాను ప్రత్యర్థులపై ఆయుధంగా వాడాలని జగన్ సర్కార్ భావిస్తుండటం గమనార్హం. అయితే వైసీపీ సోషల్ మీడియా వారియర్స్ విషయంలో టీడీపీ తన బుద్ధిని బయటపెడుతోంది.

తాజాగా ఈనాడు పత్రికలో వైసీపీ సోషల్ మీడియా వారియర్స్ కు సెల్ ఫోన్ అంటూ ఒక కథనం ప్రచారంలోకి వచ్చింది. చాలామంది ఈ ప్రచారం నిజమేనని నమ్మారు. వైసీపీ అధికారంలో ఉన్న పార్టీ కావడంతో సెల్ ఫోన్ ఇచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమయ్యాయి. అయితే వైసీపీ మాత్రం ఒక కిట్ ను పంపిణీ చేసినా అందులో సెల్ ఫోన్ మాత్రం లేదు.

వైసీపీ నేతలు మేనిఫెస్టో, కండువా, నోట్ బుక్, కీ చైన్, పెన్, జగన్ ఫోటోతో ఉన్న టీ కప్పు, టోపీ, ఫ్యాన్ లోగోతో ఉన్న టీషర్ట్ మాత్రం ఇచ్చారు. ఈనాడు మాత్రం నిజంగానే తమ దగ్గర సమాచారం ఉందనే విధంగా ఈ తరహా వార్తలను ప్రచారంలోకి తీసుకొచ్చింది. టీడీపీని గెలిపించాలనే ఆలోచనతో వైసీపీ ఫోన్లు పంపిణీ చేసిందనే విధంగా ఎల్లో మీడియా కథనాలను ప్రచారం చేస్తోంది.

అయితే ప్రజలు ఒకప్పటిలా అమాయకులు కారు. ఎల్లో మీడియా ప్రచారం చేసిన ప్రతి కథనాన్ని నిజమని నమ్మే స్థితిలో ప్రజలు లేరనే సంగతి తెలిసిందే. టీడీపీకి ఎల్లో మీడియా వల్ల కలుగుతున్న మేలు కంటే చేటే ఎక్కువగా ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. వైసీపీ గురించి దుష్ప్రచారం మాని టీడీపీ బలోపేతం అయ్యేలా కృషి చేస్తే బాగుంటుందని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.