వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామ, వార్డ్ వాలంటీర్ల వ్యవస్థను ప్రవేశపెట్టింది. రాష్ట్రంలో ప్రస్తుతం 2.61 లక్షల మంది వాలంటీర్లు ఉన్నారు. వైసీపీ వల్లే తమకు ఉద్యోగాలు వచ్చాయి కాబట్టి వాలంటీర్లకు వైసీపీపై ప్రేమ ఉండటం సాధారణమే అనే సంగతి తెలిసిందే. అయితే వైసీపీ పార్టీలకు, కులాలకు అతీతంగా పథకాలను అమలు చేస్తోంది. ఏపీలో ప్రస్తుతం అర్హతలు ఉన్నవాళ్లకు మాత్రమే పథకాలు అందుతున్నాయి.
అర్హతలు లేని వాళ్లు వేర్వేరు కారణాల వల్ల పథకాల ప్రయోజనాలను పొందడంలో ఫెయిలవుతున్నారు. అయితే అర్హత లేకపోవడం వల్ల ఒకటీరెండు పథకాలు అందకపోయినా మిగతా పథకాల ప్రయోజనాలు పొందుతుండటంతో ప్రజలు సైతం జగన్ సర్కార్ గురించి పాజిటివ్ ఒపీనియన్ ను కలిగి ఉన్నారు. వాలంటీర్లు పూర్తిగా రాజకీయ కార్యకలాపాలే చేస్తున్నారని ఎల్లో మీడియా ప్రచారం చేస్తోంది.
ఓటర్లకు వాలంటీర్లు డబ్బులు పంచుతున్నారని కూడా ఎల్లో మీడియా ప్రచారం చేస్తోంది. వైసీపీ కొత్తగా గృహ సారథులను నియమిస్తున్న నేపథ్యంలో టీడీపీ కావాలనే వాళ్లను టార్గెట్ చేస్తోందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఎల్లో మీడియా ద్వారా వాలంటీర్లను టార్గెట్ చేస్తే వాలంటీర్ల మద్దతు కూడా టీడీపీ కోల్పోయే ఛాన్స్ అయితే ఉంటుంది. ఈ విధంగా జరిగితే టీడీపీకే ఊహించని స్థాయిలో నష్టం కలుగుతుందని చెప్పవచ్చు.
వాలంటీర్లు, వాలంటీర్ల కుటుంబాలు, బంధువుల ఓట్ల సంఖ్య కోట్ల సంఖ్యలో ఉంటుంది. ప్రతి కుటుంబం జగన్ సర్కార్ అమలు చేసే పథకాలను ప్రస్తుతం పొందుతోంది. జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేసేవాళ్లు ఈ విషయాలను గుర్తుంచుకోవాలని ఫ్యాన్స్ నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి. వాలంటీర్ల గురించి చేస్తున్న ప్రచారం విషయంలో టీడీపీ తప్పు చేస్తోందని కొంతమంది చెబుతున్నారు.