వైఎస్ జగన్ మెహన్ రెడ్డిని ఆకాశానికి ఎత్తేసిన నేషనల్ మీడియా

YS Jagan should correct this mistake immediately

అధికారంలోకి వచ్చిన 15 నెలల్లో వైసీపీ నేతలకు, వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి దాదాపు తీసుకున్న చాలా నిర్ణయాలకు కోర్ట్ ల నుండి చివాట్లు తింటూనే ఉన్నారు. కానీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న అభివృద్ధిని కొన్నిసార్లు కేంద్ర ప్రభుత్వంతో పాటు నేషనల్ మీడియాను కూడా ఆశ్చర్యపరుస్తోంది. బిజినెస్‌ రిఫార్మ్‌ యాక్షన్‌ ప్లాన్‌-2019 ర్యాంకింగ్‌ లో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచింది. రెండో స్థానంలో యూపీ, మూడో స్థానంలో తెలంగాణ ఉన్నాయి.

ర్యాంకింగ్స్‌ను కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ శనివారం విడుదల చేశారు. ఈ జాబితాలో మరోసారి ఏపీ అగ్రస్థానంలో నిలిచింది. 2017-18లో ఏపీ మొదటి స్థానంలో ఉంది.. ఇప్పుడు 2018-19లోనూ అగ్రస్థానంలో నిలిచింది.

కేసీఆర్ కంటే మెరుగ్గా పనిచేసిన జగన్:

ఈజీ ఆఫ్ డూయింగ్ బిసినెస్ ర్యాంకింగ్ లో తెలంగాణ కేసీఆర్ ప్రభుత్వాన్ని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం మెరుగైన పనితనం కనపరిచింది. 2017-18 ర్యాంకింగ్ లో తెలంగాణ రెండో స్థానంలో నిలిచింది. అయితే ఇప్పుడు తెలంగాణ మూడో స్థానంలో నిలిచింది. 2017-18లో పన్నెండో స్థానంలో ఉన్న ఉత్తరప్రదేశ్ రెండో స్థానం సంపాదించుకుంది. రెండో స్థానంలో ఉన్న తెలంగాణ 2019కి వచ్చే సరికి ఒక స్థానాన్ని కోల్పోయింది. ఇక నాలుగో స్థానంలో మధ్యప్రదేశ్, ఐదో స్థానంలో ఝార్ఖండ్‌, ఆరో స్థానంలో ఛత్తీస్‌గఢ్‌లు నిలిచాయి.

జగన్ ను పొగుడుతున్న నేషనల్ మీడియా

వ్యాపార సంస్కరణల కార్యాచరణ ప్రణాళికలోని సంస్కరణల అమలు ఆధారంగా దేశంలోని 34 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ర్యాంకులు ప్రకటిస్తున్నారు. పరిశ్రమల స్థాపన అనుమతుల కోసం ఆన్‌లైన్ సింగిల్ విండో వ్యవస్థ, భూ రికార్డుల నిర్వహణ, కేంద్రీయ తనిఖీ విధానం, పన్నులు, కార్మిక నిబంధనలు, విద్యుత్ సౌకర్యాల కల్పన తదితర 12 అంశాల ప్రాతిపదికన ఈ ర్యాంకులు ఇచ్చారు. ఇవన్ని చేయడంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కనపరిచింది నిబద్ధతను కేంద్ర పెద్దలు కూడా మెచ్చుకుంటుంన్నారు. అలాగే నేషనల్ మీడియా కూడా జగన్ ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలను వివరిస్తూ జగన్ ను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల కంటే కూడా జగన్ ప్రభుత్వం మెరుగైన పనితనం కనపరిచిందని నేషనల్ మీడియా చెప్తుంది. ఈజీ ఆఫ్ డూయింగ్ బిసినెస్ లో మొదటి ర్యాంక్ రావడంతో వైసీపీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.