లోకేష్ నీ సంగతి మర్చిపోయావా ?

లోకేష్ నీ సంగతి మర్చిపోయావా ?

గురివింద గింజ సామెతను మర్చిపోయి నారా లోకేష్ ట్విటీల ను చేస్తున్నట్టుగా వుంది . ఎదుటి వారిపై బురద చల్లేటప్పుడు తమపైనే పడకుండా చూసుకుంటారు విజ్ఞులు , వివేకులైనవారు . అదే తెలివి తక్కువ వారు , తొందరపాటు తనంతో చేసే పనులు , చెప్పే నీతులు వారి అవివేకాన్ని బయటపెడతాయని చెప్పే ఘటన ఇప్పుడు వెలుగులోకి వచ్చింది . రాజధాని అమరావతి లో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని , హీరో బాలకృష అక్కడ భూములు కొన్నారని వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసిన ఆరోపణలపై తెలుగుదేశం పార్టీ కార్యదర్శి నారా లోకేష్ ట్విట్టర్ లో వెంటనే స్పందించాడు .

తన తండ్రి ఎన్ .టి . రామారావు అధికారంలో ఉండగా ఏనాడు అధికారాన్ని దుర్వినియోగం చెయ్యకుండా నీతి ,నిజాయితో ఎదిగినవాడు బాలకృష్ణని పేర్కొన్నాడు . ఇంతవరకు బాగానే వుంది . రామారావు అధికారాన్ని ఆయన కొడుకులు ఎవరు వాడుకోలేదు . అయితే తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఎదిగిన చరిత్ర వై కా పా నాయకుడిదని పరోక్షముగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ని దృష్టిలో పెట్టుకొని లోకేష్ వ్యాఖ్యానించాడు . అయితే తన తండ్రి చంద్ర బాబు నాయుడు అధికారాన్ని ఏనాడు లోకేష్ వాడుకోలేదా ?
శాసన సభ్యుడుగా ఎన్నిక కాకుండానే మంత్రి అయి ,ఆ తరువాత శాసన మండలి సభ్యుడై న సంగతి లోకేష్ మర్చిపోయాడా ? తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని శాసన సభ్యులను , మంత్రులను ,అధికారులను ఏరకంగా ఇబ్బంది పెట్టాడో లోకేష్ మర్చిపోయాడా ?

నిజానికి జగన్ మోహన్ రెడ్డి కి లోకేష్ కు పోలికే లేదు . జగన్ మోహన్ రెడ్డి తండ్రి చనిపోయిన తరువాత కస్టాలు , నష్టాలు , కేసులు , అవమానాలు , అవహేళనలు తట్టుకొని నిలబడ్డాడు , జనం లో ఉండి , జన నేతగా ఎదిగి రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యాడు . అదే లోకేష్ తండ్రి చంద్ర బాబు నాయుడు ముఖ్యమంత్రి గా ఉండగానే ఆయన అధికారాన్ని అడ్డంపెట్టుకొని పెత్తనం చేశాడు , ఇప్పుడు ఫలితం అనుభవిస్తున్నాడు , అయినా ఇప్పటికీ లోకేష్ లో మార్పు రాలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి .