ఓర్చుకో జగన్… లోకేష్ వదిలేసున్నాడంట!

వైఎస్సార్, చంద్రబాబు, జగన్, షర్మిళ ల లగా తాను పాదయాత్ర చేసి, చరిత్ర సృష్టించే విజయాన్ని సాధించాలని “యువగళం” ప్రారంభించారు చినబాబు లోకేష్! ఈ పాదయాత్ర ప్రారంభమై ముడు వారాలు గడిచిందో లేదో అప్పుడే సెకండ్ థాట్ కి వెళ్తున్నారంట నేతలు! కాకపోతే అప్పటివరకూ జగన్ సర్కార్ కాస్త ఓర్చుకోవాలంటున్నారు వైకాపా సానుభూతిపరులు!

వివరాల్లోకి వెళ్తే… లోకేష్ పాదయాత్ర వల్ల ప్రయోజనం సంగతి దేవుడెరుగు, డ్యామేజే ఎక్కువగా జరుగుతుందనే వాదన కొంతమంది సీనియర్లు వ్యక్తపరుస్తున్నారంట. పాదయాత్రలో ప్లానింగ్ ఉంది కానీ.. ప్రజలకు ఆకర్షించేస్థాయిలో ఫెర్మార్మెన్స్, ప్రసంగం లోపిస్తున్నాయనేది వారి వాదనట! దీంతో పాటు ఖర్చు కూడా తడిచి మోపెడవుతుందని.. ఈ ఖర్చేదో ఎన్నికల్లో చేసినా ప్రయోజనం ఉంటుందనేది వారి అభిప్రాయంగా ఉందంట.

జగన్ ముందస్తుకు రాకపోతే సుమారు ఎన్నికలు దగ్గరకు వచ్చేవరకూ లోకేష్ పాదయాత్ర జరిగే పరిస్థితి. ఇప్పుడూ ఖర్చుపెట్టీ, మళ్లీ ఎన్నికలకూ ఖర్చు పెట్టడం వల్ల అదనపు భారమనేది వారి ఆవేదనంట! ఫలితంగా… ఏదో ఒక బలమైన కారణం చూపించి.. పాదయాత్రను ఆపితే మంచిదనేది ఫైనల్ కామెంట్ అంట!

అయితే… లోకేష్ పాదయాత్ర వల్ల టీడీపీ కి ఎంత ఉపయోగం, వైకాపా కు ఎంత డ్యామేజ్ అన్నది తెలిసిన విషయమే! కానీ… ఈ యాత్ర పేరు చెప్పి జగన్ పై లోకేష్ చేస్తున్న కామెంట్లు మాత్రం శృతి మించుతున్నాయనేది వైకాపా నేతల ఆగ్రహం. సో… ఆ ఆగ్రహాన్ని మరింత పెంచేలా జగన్ ని విమర్శిస్తే.. తెలంగాణలో కేసీఆర్, షర్మిళను అరెస్ట్ చేసినట్లు చేసినా బాగుండు.. ఆ వంకన అయినా ఆపేద్దామనే ఆలోచనలో కూడా ఉన్నారట తమ్ముళ్లు!

ఇప్పటికే అనుచిత వ్యాఖ్యలు పేరుచెప్పి తెలంగాణలో షర్మిళను అరెస్టు చేసింది టి.సర్కార్. ఇదే పద్దతిలో చినబాబుపై కూడా ఏపీ సర్కార్ చర్యలు తీసుకుంటే.. అంతకు మించిన సువర్ణావకాశం మరొకటి ఉండదనేది వారి కోరికన్నమాట! సో… ఈ సమయంలో జగన్ & కో కాస్త ఓర్చుకుంటే… చినబాబే స్వయంగా కాడి వదిలేస్తారని అంటున్నారు విశ్లేషకులు!

మరి లోకేష్ పాదయాత్రలో చేస్తున్న కామెంట్లకు జగన్ & కో ఓర్చుకుంటారా… లేక, లోకేష్ ఉచ్చులో పడి, పాదయాత్ర ఆపి విశ్రాంతి తీసుకోవడానికి సహకరిస్తారా అన్నది వేచి చూడాలి!!