ఫ్యాన్స్ ఫీలింగ్: లోకేష్ కి కూడా వెన్నుపోటా?

రాజకీయాల్లో బ్యాక్ గ్రౌండ్ ఎంతున్నా.. వ్యక్తిగత ప్రతిష్ట చాలా ముఖ్యం. ఎప్పటికీ తాను వైఎస్సార్ కొడుకుని అని సొంతకష్టాన్ని నమ్ముకోకపోయి ఉంటే.. జగన్ కి ఈ రోజు ఈ పొజిషన్ వచ్చి ఉండేది కాదు! ఆ విషయం ఇంతకాలానికి తెలుసుకోబట్టే రాహుల్ గాంధీ సైతం యాత్రలు చేపట్టి.. వ్యక్తిగత గుర్తింపు తెచ్చుకునే పని చేసుకున్నారు. ప్రస్తుతం చినబాబు సైతం ఇదే పనిలో ఉంటే… బాబు గారు డిస్ట్రబ్ చేస్తున్నారని అంటున్నారు లోకేష్ ఫ్యాన్స్!

అవును… తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నసమయంలో ఎమ్మెల్సీ కోటాలో మంత్రి అయిపోయారు లోకేష్. అప్పటీకి ఆయనకున్న అనుభవం, అవగాహన ఎంతన్న సంగతి కాసేపు పక్కనపెడితే… చినబాబు డైరెక్టుగా మంత్రి అయిపోయారు. కానీ, ఆ ప్రభావం వ్యక్తిగత మైలేజ్ గా మార్చుకోవడంలో విఫలమైన లోకేష్… అనంతరం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు! దీంతో… వైకాపా నేతలు మైకులందుకున్నారు!

లోకేష్ గురించి కామెంట్ చేసే ప్రతీసారీ… వార్డ్ మెంబర్ గా కూడా గెలవలేని వాడు అని, ముందు ఎమ్మెల్యేగా గెలవమనండి అని కామెంట్లు చేయడం మొదలుపెట్టారు. కొడుకు అసమర్ధుడు కాబట్టే.. చంద్రబాబు ఈ వయసులో కూడా కష్టపడుతున్నాడని సూటిపోటిమాటలతో దాడి మొదలుపెట్టారు. దీంతో… ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నారు చినబాబు!

అనుకున్నదే తడవుగా.. పక్కా ప్రణాళికతో, తనదైన వ్యూహాలతో, కౌంటర్లతో పాదయాత్ర మొదలుపెట్టారు. మొదటి రెండు మూడు రోజులు కాస్త తడబడినా… మెల్లిమెల్లిగా పుంజుకుంటున్నారు. మీడియా కూడా ఫోకస్ పెంచింది. అధికారపక్షం కూడా లోకేష్ యాత్రకు ప్రాముఖ్యత ఇవ్వడం మొదలుపెట్టింది. సరిగ్గా ఇదే సమయంలో చంద్రబాబు లైన్ లోకి వచ్చేశారు. “ఇదేం ఖర్మ రా బాబూ” అంటూ జనాల్లోకి రావడం మొదలుపెట్టారు.

దీంతో… తనకున్న అపార అనుభవంతో, మాటల తూటాలతో ఫోకస్ మొత్తాన్ని తనవైపు తిప్పేసుకున్నారు చంద్రబాబు. దీంతో మీడియా ఫోకస్ తో పాటు తమ్ముళ్ల ఫోకస్ కూడా చంద్రబాబు టూర్ వైపు మళ్లింది. దీంతో చినబాబు యాత్ర కాస్త పలుచన అయిపోయింది. ఇద్దరూ బ్యానర్ ఐటం కాలేరు కాబట్టి… అటోమెటిక్ గా మీడియా బాబుగారికి విలువ ఇవ్వడం మొదలుపెట్టింది!

దీంతో… అందొస్తాడనుకున్న కొడుకు అసమర్ధుడు అయిపోతున్నాడని ఇంతకాలం ఫీలయిన చంద్రబాబుకు… రామబాణంలా దూసుకొస్తున్న కొడుకు ఫోకస్ కి ఇలా అడ్డుతగలడం ఏమిటని లోకేష్ ఫ్యాన్స్ తెగ ఫీలయిపోతున్నారంట. “ఇది కరెక్ట్ కాదు బాబు గారు.. చినబాబుని కూడా ఎదగనివ్వండి.. టీడీపీ అంటే లోకేష్ అని ఈ అనుకోనివ్వండి” అంటూ కామెంట్లు పెడుతున్నారట!

దీంతో… ఈ విషయం ఈ కోణంలో బాబు గారు గ్రహిస్తారా లేక మామ అయినా – కొడుకు అయినా తనకు ఒకటే అని.. వ్యక్తిగత ప్రతిష్టే ముఖ్యమని భావిస్తారా అన్నది వేచి చూడాలి అంటున్నారు విశ్లేషకులు!