కడప జిల్లా ప్రొద్దుటూరులో దారుణ హత్యకు గురయిన టీడీపీ నేతలు సుబ్బయ్య అంత్యక్రియలు ఇవాళ జరగనున్నాయి. ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. సుబ్బయ్య అంత్యక్రియల్లో టీడీపీ నేత నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు నారా లోకేష్ ఇప్పటికే ప్రొద్దుటూరుకు వెళ్లారు. రాత్రి ఆయన అక్కడే బస చేశారు. అంత్యక్రియల నేపథ్యంలో ప్రొద్దుటూరులో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు.
ఇక సుబ్బయ్య హత్యను నిరసిస్తూ లోకేష్ దీక్ష చేపట్టారు. సుబ్బయ్య భార్య అపరాజితకు న్యాయం జరిగే వరకు తన దీక్ష కొనసాగుతోందని స్పష్టం చేశారు. ఐతే ఈ హత్య వెనక ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, ఆయన బామమరిది బంగారిరెడ్డిల హస్తముందని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
ఈనెల 29న కడప జిల్లా జిల్లా ప్రొద్దుటూరులో టీడీపీ నేత నందం సుబ్బయ్యను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసిన విషయం తెలిసిందే. పేదలకు ఇళ్ల స్థలాల కింద ఎంపిక చేసిన ప్లాట్లలోనే సుబ్బయ్యను కత్తులతో నరికి చంపారు. ప్రస్తుతం నందం సుబ్బయ్య టీడీపీ జిల్లా అధికార ప్రతినిథిగా ఉన్నారు. రాజకీయ కక్షలతోనే ప్రత్యర్థులు సుబ్బయ్యను హత్య చేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. హంతకులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఐతే అధికార పార్టీ నేతలే సుబ్బయ్యను హత్య చేయించారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
తన భర్తని చంపిన ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి,ఆయన బావమరిది బంగారురెడ్డిలను అరెస్ట్ చేయాలని ఆందోళన చేస్తున్న అపరాజితకి న్యాయం జరిగే వరకూ ప్రొద్దుటూరులోనే నా దీక్ష కొనసాగుతుంది. pic.twitter.com/WOpkGF3Ivn
— Lokesh Nara #StayHomeSaveLives (@naralokesh) December 30, 2020