2014 ఎన్నికల్లో గెలిచిన పదిరోజులోనే పార్టీనుంచి ఉడాయించి సంచలనం సృష్టించినకర్నూలు జిల్లా నంద్యాల వైసిపి/టిడిపి ఎంపి ఎస్ పి వై రెడ్డి కొద్ది సేపటి కిందట జనసేన పార్టీలో చేరారు. కూతురుతో కలసి ఆయన జనసేనాని పవన్ కల్యాణ్ ను కలిశారు. ఆయన పార్టీ కండువా కప్పి జనసేనలోకి ఆహ్వానించారు.
2014 ఎన్నికల్లో ఆయన వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నంద్యాలనుంచి లోక్ సభకు గెలిచారు. ఆతర్వాత పదిరోజుల్లోనే ఆయన ఆ పార్టీకి గుడ్ బై చెప్పి టిడిపిలో చేరిపోయారు. ఈ లోక్ సభలో మొట్టమొదటి ఫిరాయింపు దారుగా ఆయన గుర్తింపు పొందారు. తెలుగుదేశం ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు ఏర్పాటుచేయకముందే ఇలా లోక్ సభలో టిడిపి బలగం పెంచారు. తాను నియోజకవర్గం అభివృద్ది కోసమే టిడిపిలో చేరుతున్నట్లు రెడ్డి ప్రకటించారు.
ఇపుడాయన తెలుగుదేశం పార్టీకి కూడా గుడ్ బై చెప్పారు. ఇలాంటి టిడిపిలో చేరి వెళ్లిపోయిన ఎంపిలలో ఆయన రెండవ వాారు. మొదటి వ్యక్తి కర్నూలు ఎంపి బుట్టా రేణుక. ఆమె నేరుగా మళ్లీ వైసిపిలోకే వెళ్లిపోయారు. ఎస్ పి వై రెడ్డి మాత్రం జనసేనలోకి దూకారు. ఆయనను నంద్యాల లోక్ సభ అభ్యర్థిగా ఖరారు చేశారు. బిఫామ్ ఇచ్చారు.
ఇలా అందరిని చేర్చుకుంటూ జనసేన కూడా కొత్త దనం కోల్పోతున్నది. ఆ పార్టీలో కూడా పాత ముఖాలే కనిపించేపరిస్థితి ఎదురవుతున్నది.
నంద్యాలలో జనసేన జండామోసిన వాళ్లెవరూ లోక్ సభ ఎన్నికల్లో పోటీచేసేందుకు పనికిరారా?