Allu Arjun: అల్లు అర్జున్ అరెస్ట్ ఊహించని పరిణామం అని చెప్పాలి. ఒకసారిగా పోలీసులు తనని అరెస్టు చేయడంతో దేశవ్యాప్తంగా అల్లు అర్జున్ అరెస్టు గురించి పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. ఈ తరుణంలోనే ఈ అరెస్ట్ పొలిటికల్ పరంగా యూటర్న్ తీసుకుని రాజకీయాలలో కూడా చర్చలకు కారణమైంది. అల్లు అర్జున్ అరెస్ట్ వెనుక రాజకీయ కుట్ర దాగి ఉందా అంటే ఉందనే అభిమానులు భావిస్తున్నారు.
అల్లు అర్జున్ సాదాసీదా హీరో కాదు ఆయన ఒక నేషనల్ అవార్డు విన్నర్ పాన్ ఇండియా స్టార్ హీరో ఈయనకు యూత్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కుమారుడు మెగాస్టార్ చిరంజీవికి మేనల్లుడు ఇలాంటి వ్యక్తిని అరెస్టు చేయడం అంటే ఆశమాసి కాదు కానీ అల్లు అర్జున్ అరెస్టు చేశారు అంటే దీని వెనక బలమైన కారణం ఉందని అభిమానులు సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.
అల్లు అర్జున్ ఇటీవల కాలంలో ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు ఈ తరుణంలోనే ఈయన ఎదుగుదలను ఓర్వలేక కొంతమంది ఈయన పట్ల ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని అభిమానులు భావిస్తున్నారు.పుష్ప 2కు ముందు నుంచే ఆయన కొంత టాలీవుడ్ లోనూ అదే సమయంలో కొందరు నటులు, రాజకీయ నేతల్లోనూ ఈర్ష్య బాగా పెరిగింది. పుష్ప ఒకటో పార్ట్ రిలీజ్ అయిన వెంటనే అల్లుఅర్జున్ రేంజ్ మారిపోయింది. అప్పటి వరకూ టాలీవుడ్ కే పరిమితమయిన అల్లు అర్జున్ చివరకు పాన్ ఇండియా స్టార్ గా ఎదిగారు.
ఇలాంటి తరుణంలోనే 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో భాగంగా ఈయన వైకాపా నాయకుడు తన స్నేహితుడైన శిల్పా రవికి మద్దతు తెలపడం కోసం నంద్యాల వెళ్లడంతో ఈయన పొలిటికల్ పరంగా కూడా వివాదాలలో చిక్కుకున్నారు అయితే ఇప్పుడు పుష్ప సినిమాని కూడా అడ్డుకునే ప్రయత్నాలు చేసిన అది ఎవరి తరం కాలేదు. ఇలా పుష్ప 2 సినిమా విడుదల సమయంలో చోటుచేసుకున్న ఈ ఘటన ఆధారంగానే అల్లు అర్జున్ పై ఇలాంటి కుట్రలకు పాల్పడ్డారని ఈ రాజకీయ కక్షలలో భాగంగానే అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు అంటూ అభిమానులు భావిస్తున్నారు.అల్లు అర్జున్ ను పోలీసులు ఇంత వేగంగా అరెస్ట్ చేసి కోర్టుకు తరలిస్తున్నారంటే ఏదో జరుగుతుందన్న అనుమానాలు మాత్రం బలంగా వినిపిస్తున్నాయి