పాదయాత్రలో భాగంగా ప్రచారం కోసమో.. లేక, వివాదాలతోనే ఫ్రీ పబ్లిసిటీ వస్తాదనే నమ్మకమో.. అదీగాక, వారాహి యాత్రలో పవన్ కల్యాణ్ లా వైసీపీ నేతలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తే కారకర్తల్లో మాస్ అప్పీల్ వస్తుందనే భ్రమో తెలియదు కానీ… లోకేష్ ప్రస్తుతం అదే పనిలో ఉన్నారు. దీంతో తాజాగా నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి లోకేష్ పై నిప్పుల వర్షం కురిపించారు.
అవును… యువగళం పాదయాత్రలో భాగంగా వైసీపీ నేతలపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్న లోకేష్… వారిని సచ్చీలతను నిరూపించుకునే ఛాన్స్ ఇస్తున్నారు. ఫలితంగా ప్రజల్లో వాళ్లపై సానుభూతి కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా అనిల్ కుమార్ యాదవ్ విషయంలో అదే జరిగింది. దీంతో లోకేష్ విమర్శలకు క్రెడిబిలిటీ పోవడంతోపాటు అనిల్ సచ్చీలతపైనా ప్రజలకు క్లారిటీ వచ్చిందనే కామెంట్లు వినిపించాయి.
ఈ క్రమంలో తాజాగా కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిపై లోకేష్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా… కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి నల్లతాచు పాము లాంటి వాడని.. నాలుగేళ్లలో ఇసుక, మట్టి దోపిడీతో రూ.1500 కోట్లు దోచేశారని ఆరోపించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే అతని అవినీతిపై సిట్ వేసి తిన్నది మొత్తం కక్కిస్తామని హెచ్చరించారు. ఇలా లోకేశ్ తనపై చేసిన విమర్శలకు నల్లపురెడ్డి గట్టిగా సమాధానం ఇచ్చారు.
ఈ సందర్భంగా మైకందుకున్న తన ఇంటికి టీడీపీ నేతల్ని పంపిస్తే తన కుటుంబ సభ్యులపై ఉన్న ఆస్తుల వివరాలు కూడా ఇస్తానని.. తాను రూ.1500 కోట్లు సంపాదించినట్టు తేలితే మొత్తం పంచుతానని సవాల్ విసిరారు. నీ వయసెంత, నువ్వెంత? నా కాలి గోటికి సరిపోవు? లోకేశ్ పై విరుచుకుపడ్డారు. అసలు చంద్రబాబుకు ఎట్లా పుట్టావురా? అంటూ విరుచుకుపడ్డారు. నీ తాత రెండెకరాల భూమిని మీ తండ్రికి ఇచ్చాడని, ఇవాళ రూ.4 లక్షల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయని నిలదీశారు.
అనంతరం కోవూరు నియోజకవర్గ టీడీపీ నాయకులు రాయించిన దాన్ని చదివి.. తనను, జగన్ మోహన్ రెడ్డిని తిట్టి వెళ్లాడని చెప్పిన ఆయన… రూ.1500 కోట్ల అవినీతి ఆరోపణలపై సీబీఐ విచారణకు సిఫార్సు చేయాలని తమ ముఖ్యమంత్రి జగన్ ను అడుగుతానని అన్నారు. తనపై లోకేష్ చేసిన అవినీతి ఆరోపణలు నిజమైతే తనను బుచ్చిరెడ్డిపాళెంలో ఉరి తీయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా లోకేశ్ విదేశాల్లో అమ్మాయిలతో సరస సంబరాల్లో మునిగితేలిన ఫొటోలను ఆయన ప్రదర్శించడం గమనార్హం.