హవ్వ నవ్విపోతారని కూడా ఆలోచించటం లేదు చంద్రబాబునాయుడు. మహాత్మా గాంధీలా సాధారణ జీవితం గడుపుతున్న తనపై అవినీతి ఆరోపణలు చేస్తారా అంటూ నరేంద్రమోడిపై నిప్పులు చెరిగారు. తాను మహాత్మాగాంధీలా సాధారణ జీవితం గడుపుతున్నట్లు చెప్పటంతో అందరూ ఆశ్చర్యపోయారు. మహాత్మాగాంధీ లైఫ్ స్టైల్ కు చంద్రబాబు లైఫ్ స్టైల్ కు ఏమన్నా పోలికుందేమో అని అందరూ ఇపుడు వెతుకుతున్నారు. మామూలుగా అందిరికీ తెలిసిన గాంధీ ఒంటిపై ఏదో గోచిపాత, కొల్లాయి గుడ్డ, చేతిలో కర్ర తప్ప మరోటి కనబడదు. మరి చంద్రబాబు వేసుకునే బట్టల మాటో ?
అదికూడా చంద్రబాబే వివరణ ఇచ్చుకున్నారులేండి. గడచిన 40 ఏళ్ళుగా తాను కూడా ఒకే రకమైన బట్టలు వేసుకుంటున్నారట. కాబట్టి తనకు గాంధీకి తేడా లేదని చంద్రబాబు భావన. నిజానికి గాంధీతో చంద్రబాబు పోలిక పెట్టుకోవటమంటే మహాత్మా గాంధీని అవమానించటం తప్ప మరేం కాదు. గాంధి విషయంలో చంద్రబాబు పోల్చుకోవాల్సింది ఖద్దరు గుడ్డలు వేసుకకున్నారా లేదా, గోచిపాత, కొల్లాయి గుడ్డ కట్టుకున్నారా లేదా అన్నది కాదు. గాంధీ జీవించిన సింపుల్ జీవితాన్ని చూడాలి.
అబద్ధం చెప్పకూడదని, ఎల్లపుడూ సత్యమే పలకాలని, విలువలతో కూడిన జీవితమే అందరికీ ఆదర్శప్రాయమని గాంధి చెప్పిన విషయం ఎన్నో పుస్తకాల్లో చదివారు. తమ జీవితం ఇతరులకు ఆదర్శప్రాయంగా ఉండాలనేది గాంధి ఫిలాసఫి. మరి చంద్రబాబు సంగతేంటి ? ఏరోజన్నా నిజాలు చెప్పారా ? రాజకీయాల్లో గాంధి చెప్పిన సూక్తుల్లో ఒక్కటి కూడా చంద్రబాబు తత్వానికి సరిపడదు. అత్యంత అవినీతిపరుల్లో ఒకరుగా ఎన్నో వెబ్ సైట్లు మొత్తుకున్నాయి. రాజకీయాల్లో చంద్రబాబు అరాచకానికి పరాకాష్టగా నిలిచారు. ఫిరాయింపులను ప్రోత్సహించటం, కోట్ల రూపాయలు పెట్టి ఎంఎల్ఏలను కొనుగోలు చేయటం,
సిఎం హోదాలో అత్యంత ఆడంబరమైన, విలాసవంతమైన జీవనాన్ని గడుపుతున్నారు చంద్రబాబు. వ్యక్తిగత ప్రచారానికి కక్కుర్తి పడుతున్నారు. నాలుగున్నరేళ్ళ పాలనలో ఎక్కడ చూసినా అవినీతే కనబడుతోంది. కరకట్టలోని తన నివాసం నుండి అమరావతిలోని సచివాలయానికి కూడా హెలికాప్టర్ వాడుతున్న చంద్రబాబు గాంధిలాంటి సింపుల్ జీవితం గడుపుతున్నట్లు చెబితే ఎవరైనా నమ్ముతారా ? తన జీవితాన్ని మహాత్మా గాంధి జీవితంతో పోల్చుకోవాలని చంద్రబాబుకు ఎలా అనిపించిందో ఆశ్చర్యంగా ఉంది.