చంద్రబాబు ఓటు టిడిపికే పడిందా ?

అవును ఈ సందేహం వ్యక్తం చేసింది ఎవరో మామూలు వ్యక్తులు కాదు. స్వయంగా చంద్రబాబునాయుడే ఈ సందేహాన్ని లేవనెత్తారు. మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఒకవేళ టిడిపి ఓడిపోతే తప్పంతా ఎన్నికల సంఘానిదే అన్నట్లుగా వేదిక తయారు చేస్తున్నారు. అందులో భాగంగానే తానేసిన ఓటు తనకే పడిందా ? లేకపోతే తానుసిన ఓటు టిడిపికే పడిందా ? అనే పనికిమాలిన సందేహాన్ని లేవనెత్తారు. ఇదే చంద్రబాబు ఒకపుడు టెక్నాలజీని ప్రపంచానికి పరిచయం చేసింది తానే అని డప్పుకొట్టుకున్నారు.

ఇంతకీ విషయం ఏమిటంటే, జరిగిన పోలింగ్ లో సగటు పోలింగ్ శాతం 80 శాతం నమోదైంది. ఎప్పుడైతే భారీ పోలింగ్ నమోదైందో వెంటనే వైసిపి నేతల్లో ఉత్సాహం కనబడింది. అదే సమయంలో టిడిపి నేతల్లో నిరుత్సాహం స్పష్టంగా కనబడింది. ఆఫ్ ది రాకార్డు మాటల్లో తమ ఓటమి ఖాయమనే విషయాన్ని ఒప్పేసుకుంటున్నారు. జనాలు ఇంతగా ఓటింగ్ లో పోటెత్తటానికి కారణం ఏమిటి ?

కారణం ఏమిటంటే, ఐదేళ్ళ చంద్రబాబు ప్రజా వ్యతిరేక పాలన అనే చెప్పాలి. అడ్డుగోలుగా, అరాచకానికి తెరఎత్తారు. ఎక్కడ చూసినా అవినీతి, కులాధిపత్యం, అరాచకాలే. దాంతో చంద్రబాబు పాలనపై విసిగిపోయిన జనాలు పాదయాత్ర సందర్భంగా జగన్ కు బ్రహ్మరథం పట్టారు. తన పాలనలోని వైఫల్యాలను అంగీకరించాల్సిన చంద్రబాబు తప్పంతా ప్రత్యర్ధులదే అంటూ మండిపడటం విచిత్రంగా ఉంది.

జగన్ , కెసియార్, మోడితో పాటు ఈసి కూడా ప్రత్యర్ధుల జాబితాలో చేరిపోయింది. ఈవిఎంల వ్యవస్దే తప్పన్నారు. చాలా చోట్ల ఈవిఎంలు మొరాయించటంతో తమకు ఓట్లేయాలని అనుకున్న జనాలంతా తిరిగి వెళ్ళిపోయారట. అదే సమయంలో ఈవిఎంల నిర్వహణపైనే అనుమానాన్ని వ్యక్తం చేశారు. ఈవిఎంలను కూడా జగన్ కు అనుకూలంగా ట్యాంపర్ చేశారంటూ కొత్త ఆరోపణ మొదలుపెట్టారు. అందుకే తాను వేసిన ఓటు తనకే పడిందా ? టిడిపికే పడిందా ? అనే పనికిమాలిన జోక్ వేసి టిడిపి ఓటమిని పరోక్షంగా అంగీకరించారు.