ఇరుక్కుపోయిన 40 ఇయర్స్ ఇండస్ట్రీ

అవును 4 ఇయర్స్ ఇండస్ట్రీ పూర్తిగా ఇరుక్కుపోయారు. కరకట్ట మీద తానుంటున్న అక్రమనిర్మాణం లింగమనేని గెస్ట్ హౌస్ పై తాజాగా చంద్రబాబునాయుడు ఏమీ మాట్లాడలేని స్ధితిలో పడిపోయారు. మొన్నటి వరకూ చంద్రబాబును సమర్ధిస్తు వచ్చిన మాజీ మంత్రలు అచ్చెన్నాయుడు, నిమ్మకాయల చినరాజప్ప లాంటి వాళ్ళు కూడా లింగమనేని గెస్ట్ హౌస్ పై ఏమీ మాట్లాడటం లేదు.

మొన్నటి వరకూ చంద్రబాబు ఉంటున్న లింగమనేని గెస్ట్ హౌస్ పై నానా యాగీ చేసిన టిడిపి నేతలు ఇపుడేమీ మాట్లాడలేకపోవటం పోవటంలో చంద్రబాబు సెల్ఫ్ గోలే కారణం. 2016 అక్టోబర్ లో  అసెంబ్లీలో మాట్లాడుతూ కరకట్ట మీదున్న లింగమనేని గెస్ట్ హౌస్ ప్రభుత్వం స్వాధీనం చేసేసుకున్నట్లు ప్రకటిచారు.

అదే విషయాన్ని తర్వాత లింగమనేని మాట్లాడుతూ తన గెస్ట్ హౌస్ ను ప్రభుత్వానికి ఇచ్చేశానని చెప్పారు. సదరు గెస్ట్ హౌస్ ఇపుడు తనది కాదు కాబట్టి ప్రభుత్వం ఏమి చేసుకున్నా తనకు సంబంధం లేదని కూడా ప్రకటించారు. అంటే చంద్రబాబు, లింగమనేని చెప్పినట్లుగా గెస్ట్ హౌస్ ప్రభుత్వానిదైపోయింది.

కానీ ఇపుడు ఇద్దరు కూడబలుక్కున్నట్లుగా  రివర్స్ లో మాట్లాడుతున్నారు. చంద్రబాబేమో అది ప్రైవేటు ప్రాపర్టీ అని చెబుతుంటే లింగమనేని కూడా సదరు గెస్ట్ హౌస్ తనదే అంటూ వాదిస్తున్నారు. మరి 2016లో చెప్పింది కరెక్టా ? లేకపోతే ఇపుడు చెబుతున్నది కరెక్టా ? అన్నదే తేలటం లేదు. అంటే రెండింటిలో ఏదో ఒకటే కరెక్టవుతుంది కాబట్టే చంద్రబాబు అడ్డంగా ఇరుక్కుపోయారు. చూద్దాం ప్రభుత్వం ఏమి చేస్తుందో ?