సంచలనం: కూటమిలోకి జగన్ ను ఆహ్వానించిన చంద్రబాబ

రేపటి ఎన్నికల తర్వాత జగన్మోహన్ రెడ్డి తమ కూటమిలోకి వస్తే ఆహ్వానిస్తామంటూ చంద్రబాబు సంచలన ప్రకటన చేశారు. రాష్ట్రప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని జగన్ తమ కూటమిలోకి వస్తానంటే తాను కాదనను అంటూ చంద్రబాబు స్పష్టం చేశారు. ఏపి భవన్లో దీక్ష సందర్భంగా మాట్లాడుతూ, రేపటి ఎన్నికల్లో జగన్ కు ఒకటో రెండో ఎంపి సీట్లొచ్చినా కూటమిలో చేర్చుకోవటానికి తమకు అభ్యంతరం లేదన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను సాధించే లక్ష్యంలో తమతో ఎవరైనా కలిసి రావచ్చన్నారు. కానీ ఇప్పటికైతే మోడితో జగన్ కలుసున్నారని చెప్పారు. గుంటూరు బహిరంగ సభ జనసమీకరణలో జగనే సహకరించారని చెప్పారు.

చంద్రబాబు మాటలు కిందపడ్డా పై చేయి నాదే అన్నట్లుంది. చంద్రబాబు మాటల సారంసం ఏమిటంటే, రేపటి లోక్ సభ ఎన్నికల్లో టిడిపికి 23 ఎంపీ సీట్లు  రాబోతున్నట్లుంది. మిగిలిన రెండు సీట్లు కూడా జగన్ పై జాలితోనే వదిలేస్తున్నట్లుంది. అంటే జగన్ కు ఎంపి సీట్లు ఎక్కువగా రాకపోయినా సరే కూటమిలోకి వస్తానంటే చేర్చుకుంటామంటూ చంద్రబాబు పెద్ద మనసుతో చెప్పినట్లుంది. చంద్రబాబు మాటలను పక్కనపెడితే సర్వేలు మాత్రం రివర్సులో చూపిస్తున్నాయ్.

రాబోయే లోక్ సభ ఎన్నికల్లో ఏపిలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు అనే అంశంపై జాతీయ మీడియా సంస్ధలు చాలా సర్వేలు నిర్వహించాయి. ఏ సర్వేలో కూడా మెజారిటీ సీట్లు టిడిపికి వస్తాయని చెప్పలేదు. పైగా జగన్ కు 20 సీట్లంటూ దాదపు అన్నీ సర్వేలు తేల్చేశాయి. అంటే సర్వేల్లో చెప్పినట్లు వస్తాయని అనుకునేందుకు లేదు అది వేరే సంగతి. నాలుగున్నరేళ్ళ పాలనలో చంద్రబాబుపై అన్నీ వర్గాలు మండిపోతున్నది వాస్తవం. ప్రజా వ్యతిరేకతను గమినించే చంద్రబాబులో టెన్షన్ పెరిగిపోతోంది. వాస్తవం ఇలా వుంటే జగన్ కు రెండు సీట్లొచ్చినా తమ కూటమిలో చేరొచ్చనే బంపర్ ఆఫర్ ఇవ్వటమే పెద్ద జోక్