చంద్రబాబు హమీలను జగన్ అమలు చేయాలా ?

విచిత్రంగా ఉంది చంద్రబాబునాయుడు డిమాండ్. 2014 ఎన్నికల్లో తప్పుడు హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు మొన్నటి ఓటమి తర్వాత తన హామీలను అమలు చేయాలని జగన్మోహన్ రెడ్డిని డిమాండ్ చేయటమే విడ్డూరంగా ఉంది. అధికారంలో ఉన్న ఐదేళ్ళల్లో రైతు రుణమాఫీని సంపూర్ణంగా నెరవేర్చలేక నానా అవస్తలు పడ్డారు.

రుణమాఫీ హామీ అమలులో చంద్రబాబు రైతులను దారుణంగా మోసం చేశారు. ఇచ్చిన హామీ మేరకు బ్యాంకుల్లో రుణాలు తీర్చక పోవటంతో చివరకు రైతులకు బ్యాంకుల్లో రుణాలు కూడా అందకుండా చేసిన ఘనుడు చంద్రబాబు. రుణమాఫీ గురించి అడిగిన రైతులపై ఒకసారి కేసులు కూడా పెట్టించారు. అలాంటిది ముక్కి మూలిగి ఏదో మూడు విడతల మాఫీ చేశానని అనిపించుకున్నారు.

రైతు రుణమాఫీ హమీని నెరవేర్చటంలో చంద్రబాబుకే చిత్తశుద్ది లేదు. అలాంటిది మిగిలిన చివరి రెండు విడతల సొమ్మును రైతులకు చెల్లించాలని చంద్రబాబు డిమాండ్ చేయటమే విచిత్రంగా ఉంది. చంద్రబాబు హామీని జగన్ ఎందుకు నెరవేర్చాలో ఎవరికీ అర్ధం కావటం లేదు.  రుణమాఫీ హామీలో మిగిలిన 4, 5 విడతల సొమ్మును రైతులకు ఇవ్వాలని జగన్ ను డిమాండ్ చేయటంమే పెద్ద క్యామిడిగా తయారైంది.

రుణమాఫీ చేయాల్సిన మొత్తం  10 వేల కోట్ల రూపాయలు. అధికారంలో ఉన్నపుడు అడ్డ దిడ్డమైన ఖర్చుల పేరుతో ఖజానాను సాంతం నాకేశారు. లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసినా చంద్రబాబు అధికారంలో నుండి దిగిపోయేనాటికి ఖజానాలో ఉన్నది కేవలం రూ 100 కోట్లు మాత్రమే అంటే ఏ స్ధాయిలో దోచేసుకున్నారో అర్ధమైపోతోంది. అలాంటిది తన హామీని ఇపుడు జగన్ అమలు చేయాలని డిమాండ్ చేయటమే విచిత్రంగా ఉంది.