Nagababu: ఏపీలో కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత జనసేన పార్టీ నాయకులు కూడా కీలక ప్రాధాన్యత వ్యవహరిస్తున్నారు. ఇక ప్రస్తుతం ఏవి కేబినెట్లో జనసేన పార్టీ నుంచి నలుగురు మంత్రులు రావాల్సి ఉండగా కేవలం ముగ్గురు మాత్రమే కొనసాగుతున్నారు. ఒకటి పవన్ కళ్యాణ్ రెండు నాదెండ్ల మనోహర్ కందుల దుర్గేష్ ఈ ముగ్గురు మాత్రమే మంత్రులుగా కొనసాగుతున్నారు అయితే నాలుగో మంత్రిగా నాగబాబుకు స్థానం కల్పించినట్టు తెలుస్తుంది.
ఈయన ఎన్నికలలో పోటీ చేయకపోయినా కూడా ఇలా మంత్రిగా బాధ్యతలు తీసుకోబోతున్నారు అనే విషయం పట్ల తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. అయితే ఉన్న ఫలంగా నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వడానికి కారణం ఏంటి అనే విషయానికి వస్తే నాదెండ్ల మనోహర్ కు చెక్ పెట్టడం కోసమే నాగబాబుకు మంత్రి పదవి ఇస్తున్నారు అంటూ ఓ వార్త బయటకు వచ్చింది.
ప్రస్తుతం పౌరసరఫరాల శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న నాదెండ్ల మనోహర్ పార్టీ పరంగా ఎక్కడ కూడా యాక్టివ్గా కనిపించలేదు అంతేకాకుండా గతంలో ఈయన తండ్రి నాదెండ్ల భాస్కరరావు కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. అయితే ఆ సమయంలో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి తెలుగుదేశం పార్టీని తొక్కేశారు.
ఇలా గతంలో వెన్నుపోటు రాజకీయాలు చేసిన నాదెండ్ల భాస్కర రావు వారసుడిగా నాదెండ్ల మనోహర్ కూడా రాజకీయాలలో కొనసాగుతున్నారు ఎప్పటికైనా ఈయనతో తనకు ప్రమాదమే అని భావించిన పవన్ కళ్యాణ్ తన కుడి భుజం అయినటువంటి నాదెండ్ల మనోహర్ ను తప్పించే ఆస్థానంలోకి తన అన్నయ్య నాగబాబును తీసుకురావాలని చూస్తున్నారు.
తాను వారసత్వ రాజకీయాలు చేయనంటూ గతంలో గొప్పలు చెప్పిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆ మాటలన్నింటిని మర్చిపోయి తన అన్నయ్యకు ఇలా మంత్రి పదవి ఇప్పించడం పట్ల విమర్శలు కురిపిస్తున్నారు. మరి ఏపీ క్యాబినెట్లో చోటు సంపాదించుకున్న నాగబాబు ఏ శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకుంటారు అనేది తెలియాల్సి ఉంది.