అలీని తేలిగ్గా తీసుకున్న నాగబాబు.! వాస్తవాలు తెలుసుకోకపోతే ఎలా.?

సినీ నటుడు అలీ ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వంలో ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా వున్నారు. ఆ పదవిలో ఆయన ఏం చేస్తారు.? అన్నదానిపై ఇప్పటికీ స్పష్టత లేదు. గౌరవ వేతనం.. ఇవన్నీ ఆ పదవికి కట్టబెట్టింది వైసీపీ ప్రభుత్వం. రాజకీయాలన్నాక ఇవన్నీ మామూలే.ఆ సంగతి పక్కన పెడితే, వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ మీద పోటీ చేస్తారా.. అంటే, అధిష్టానం ఆదేశిస్తే.. అని సమాధానమిచ్చారు అలీ. నిజానికి, ‘నో కామెంట్’ అనేసి వుంటే, అలీకే బావుండేది. సరే, అలీ మాట్లాడిన దాంట్లోనూ తప్పేమీ లేదు. మీడియా అడ్డగోలు వంటకాలతో విషయం వివాదాస్పదమయ్యింది.

‘అలీ వ్యాఖ్యలపై నో కామెంట్.. పట్టించుకోవాల్సిన మేటర్ కాదు..’ అని నాగబాబు తేలిగ్గా తీసుకున్నారు, అలీ వ్యాఖ్యలపై స్పందించాలని మీడియా కోరితే. ఇక, జనసేన వైపు నుంచి నాగబాబు వ్యాఖ్యలపై వక్రీకరణలు ఓ రేంజ్‌లో వున్నాయి. సోషల్ మీడియాలో పెద్ద రచ్చ జరుగుతోంది.

వైసీపీ జోరులో అలీ గనుక పోటీ చేస్తే, ఏ ఉప ఎన్నికలో అయినా గెలిచేసి వుండేవారు. ఆ అవకాశం జనసేన అధినేతకు లేదు కదా.! నాగబాబు, అలీని మరీ అంత తేలిగ్గా తీసుకుంటే ఎలా.? ఏమో, పట్టుదలకు పోయి, పవన్ కళ్యాణ్ మీద అలీని పోటీకి జగన్ దింపితే.. మైనార్టీ సెంటిమెంట్ వర్కవుటయి, అలీ బంపర్ విక్టరీ కొట్టినా ఆశ్చర్యమేముంది.? ఓడిపోవడం పవన్ కళ్యాణ్‌కి అలవాటే కదా.?

కాగా, నాగబాబు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయరట. బహుశా ఆల్రెడీ ఓటమి చవిచూసిన భయంతోనే నాగబాబు ఈ నిర్ణయం తీసుకున్నారేమో.!